हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Hospitals: ఏపీలో నిలిచిపోనున్న వైద్య సేవలు

Aanusha
Latest News: Hospitals: ఏపీలో నిలిచిపోనున్న వైద్య సేవలు

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సేవల రంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు అక్టోబర్ 10 నుండి నిలిపివేయబోతున్నాయి. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ASHA) ద్వారా తీసుకోబడింది. అసోసియేషన్ ప్రకారం, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ (NTR Medical Service Trust) ఆధ్వర్యంలో అందించే వైద్య సేవలను రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో (Hospitals) నిలిపివేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వం వారి బకాయిలను విడుదల చేయకపోవడం కారణంగా తీసుకోవాల్సి వచ్చింది.

Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా పోరాడుతాం

 అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav).. బకాయిలు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ.. ఆ పని జరగలేదని వెల్లడించింది.ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు రూ.2700 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని కొంత కాలంగా ప్రైవేటు ఆసుపత్రులు యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయని.. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు నష్టాల్లో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాయి.ఆసుపత్రుల యాజమాన్యాలు బకాయిలు చెల్లించాలని అడుగుతున్నా.. ప్రభత్వం సమయం కోరుతూ వచ్చింది. కానీ గత రెండు, మూడు రోజులుగా ప్రైవేట్ వైద్యులు (Private doctors) ఆందోళనను ఉద్ధృతం చేశారు.

 Hospitals
 Hospitals

ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిపివేయాలని

రాజకీయ నాయకులను కూడా కలిశారు. అయిలా ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు (NTR Health Services) పూర్తిగా నిలిపివేయాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. శుక్రవారం (అక్టోబర్ 10)అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయక తప్పదని స్పష్టం చేశాయి.దాదాపు 15 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలపై ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ప్రైవేటు వైద్యులు తెలిపారు.

తమ సమస్యలను సీఈవో, ఆరోగ్య కార్యదర్శి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే ప్రభుత్వం ఇంకా కొంత సమయం అడిందని.. కానీ బుధవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్‌లో.. ఆసుపత్రుల యాజమాన్యాలు సమయం ఇవ్వడం కష్టమని తేల్చాయని వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించే పరిస్థితి లేదని చెప్పినట్లు తెలిపారు. కాగా, వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ప్రైవేటు వైద్యులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870