हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: High Court: చార్జిషీట్ వేయడానికి ఇంకెన్నాళ్లు కావాలి?

Rajitha
News Telugu: High Court: చార్జిషీట్ వేయడానికి ఇంకెన్నాళ్లు కావాలి?

నల్లపాడు Nallapadu పోలీసుల తీరుపై హైకోర్టు High Court అసంతృప్తి విజయవాడ : గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులపై ఎపి హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ యువతి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు పూర్తి చేసినప్పటికీ అభియోగపత్రం/తుది నివేదికను సంబంధిత కోర్టులో దాఖలు చేయకపోవడంపై నల్లపాడు పోలీసుల వ్యవహర సరళి సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. భవనంపై నుండి పడిపోయినట్లు అనుమానాస్పద పరిస్థితులో చనిపోయిన మృతురాలే వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు కొత్త కథ అల్లారని పేర్కొంది. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆ యువతి మృతి చెందితే ఆమె మరణ వాంగ్మూలాన్ని ఎవరు ఎలా నమోదు చేశారని పోలీసులను ప్రశ్నించింది. కోర్టులన్నా, కోర్టు ఉత్తర్వులన్నా, సిబ్బందన్నా పోలీసులకు గౌరవం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలించి వాదనలు వినిపించేందుకు పిటీషనర్ తరపు న్యాయవాదికి సమయం ఇస్తూ విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

Free Benefits: ఉచిత బస్సులపై వెంకయ్య నాయుడు ఫైర్

High Court

High Court

న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. గుంటూరు Guntur జిల్లా బుడంపాడు సెయింట్ మేరీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న గర్నెపూడి శ్రావణసంధ్య (17) కళాశాల వసతి గృహం లోని 4వ అంతస్థు నుంచి పడిపోయారని వార్డెన్ నుండి తల్లిదండ్రులకు 2017 ఫిబ్రవరి 28న ఫోన్కాల్ అందింది. ఈ వ్యవహారంపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వారు దర్యాప్తు సక్రమంగా చేయడం లేదని సిబీఐ లేదా సిఐడికి కేసు ఇవ్వాలని మృతురాలి తల్లి జయలక్ష్మి 2017 జులైలో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇటీవల వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు…దర్యాప్తును సీబీఐకి ఇవ్వడానికి ఇది సముచితమైన కేసు అని అభిప్రాయపడింది. సోమవారం జరిగిన విచారణలో పోలీసులు తరపున హోం శాఖ జీపీ జయంతి వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తు పూర్తి చేశామని తెలిపారు. అలా అయితే ఛార్జిషీట్ ఎందుకు వేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. హైకోర్టులో వ్యాజ్యం పెండింగ్లో ఉన్న కారణంగా దాఖలు చేయలేదని జిపి బదులివ్వగా అభియోగపత్రం దాఖలు చేయకూడదంటూ కోర్టు నుంచి నిషేధ ఉత్తర్వులు ఏమీ లేవు కదా అని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు.

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులపై హైకోర్టు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేసింది?
యువతి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు పూర్తి చేసినప్పటికీ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

హైకోర్టు పోలీసులను ఏ విషయంపై ప్రశ్నించింది?
ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయానికి యువతి మృతి చెందిందంటే ఆమె మరణ వాంగ్మూలాన్ని ఎవరు నమోదు చేశారని హైకోర్టు ప్రశ్నించింది.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870