మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో(Hidma Encounter) ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల పోస్టుమార్టం ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో తొమ్మిది మందికి సంబంధించిన మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఉంచబడ్డాయి. ఇటీవలి రెండు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 13 మంది మరణించారు. వీరిలో ఇప్పటివరకు హిడ్మా,(Hidma Encounter) అతని భార్య, టెక్ శంకర్, దేవే మృతదేహాల పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబాలకు అందజేశారు. టెక్ శంకర్ మృతదేహాన్ని ఆయన బంధువులు నిన్న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు నుంచి తీసుకెళ్లారు.
Read Also: KTR: ప్రైవేటుల లాభానికే ఫార్ములా–ఈ కుట్ర: ఏసీబీ సంచలనం

ఛత్తీస్‌గఢ్ బంధువుల రాక కోసం ఎదురు
మిగిలిన 12 మంది మృతులూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే కావడంతో అక్కడి నుంచి కుటుంబ సభ్యులు రంపచోడవరం చేరుకోవాల్సి ఉంది. సుదూర గ్రామాల నుంచి రాకలో ఆలస్యం జరుగుతుండటంతో పోస్టుమార్టం ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇప్పటికే కొందరు బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహాలను తీసుకెళ్లేందుకు వేచి చూస్తున్నారు. అందరూ చేరిన తరువాత మిగిలిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబాలకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: