हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest Telugu news : Heart attack : జీవన ప్రమాణానికే కాటు.. గుండెపోటు

Sudha
Latest Telugu news : Heart attack : జీవన ప్రమాణానికే కాటు.. గుండెపోటు

గుండెపోటు ఈ రోజుల్లో ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. ఇది కేవలం వృద్ధులకే కాకుండా, చిన్న వయసు వారికి కూడా వస్తోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అకాల మరణాల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతోంది. ఇటీవల, కర్ణాటకలోని హాసన్ జిల్లాలో కేవలం 40 రోజుల్లో 22 మంది గుండెపోటు (Heart attack)తో మరణించారు. వీరిలో దాదాపు సగం మంది 45 ఏళ్ల లోపు వారు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ భయంకరమైన పరిస్థితిని గమనిస్తే, మన దేశం ఈ హృదయ సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది. మనదేశంలో గత మూడు సంవత్సరాలుగా గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగా యి. నేషనల్ క్రైమ్రి కార్డ్స్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం, 2022లో గుండెపోటు కారణంగా 32,457 మంది మరణించారు. ఇది అంతకుముందు సంవత్సరంలో నమోదైన 28, 413 మరణాల కంటే చాలా ఎక్కువ. ఈ నివేదిక ప్రకారం 2022లోనే గుండెపోటు (Heart attack)కేసులలో 12.5 పెరుగుదల నమోదైంది. ప్రపంచ గణాంకాలలో భారతదేశం హృద్రోగ మరణాల రేటులో రెండవ స్థానంలో ఉంది. మన దేశంలో ఏటా మరణిస్తున్న వారిలో సుమారు 20శాతం పురుషులు, 17 శాతం స్త్రీలు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం మన దేశంలో స్త్రీల కంటే పురుష లలో హృదయ సంబంధిత మరణాల రేటు ఎక్కువగా ఉంది. లక్ష మందిలో పురుషులలో 349 మంది, స్త్రీలలో 265 మంది మరణిస్తున్నారు. ఈ రేట్లు యూనైటెడ్ స్టేట్స్ కంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉండటంగమనార్హం. దేశంలో అకస్మాత్తుగా సంభవించే మరణాలలో దాదాపు 57 శాతం కేవలం గుండెపోటు (Heart attack)వల్లే జరుగుతున్నాయి. మరణి స్తున్న వారిలో ఎక్కువ మంది 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైన పురుషులే ఉన్నారు. అంతేకాకుండా 2020 నుంచి 2023 మధ్య వచ్చిన గుండెపోటు కేసుల్లో దాదాపు సగం మంది 40 ఏళ్లలోపు వారే. ఇది యువతలో గుండె జబ్బులు వేగంగా, తక్కువ వయసులోనే వస్తున్నాయనే ప్రమాదకరమైన వాస్తవాన్ని తెలియజేస్తోంది.

Heart attack :  జీవన ప్రమాణానికే కాటు.. గుండెపోటు
Heart attack : జీవన ప్రమాణానికే కాటు.. గుండెపోటు

పలు రాష్ట్రాల్లో ఈ మరణాలు ఎక్కువ

ముఖ్యంగా, 30ఏళ్ల లోపువారిలో మరణాలు గత కొన్ని సంవత్సరాలలో 40 శాతం పెరిగాయి. గుండెపోటు మరణాలు ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ, గుజరాత్రాష్ట్రాలలో ఎక్కువగా నమోద వుతున్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు వంటి ఇతర పెద్ద రాష్ట్రాలలో కూడా వేల సంఖ్యలో మరణాలు సంభవి స్తున్నాయి. ఈ సంక్షోభం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించి ఉందని ఇది నిరూపిస్తుంది. జీవనశైలి, జనాభా, ఆరోగ్య సంరక్షణ సదుపాయాల కొరత వంటి కారణాల వల్ల పశ్చిమ, దక్షిణ రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. హాస్పిటల్ అధ్యయనాలు కూడా 2020 నుంచి దాదాపు సగం మంది గుండెపోటు రోగులు 40ఏళ్లలోపు వారే అని చెబుతున్నాయి. గతంలో హృద్రోగాలు వృద్ధులకే వస్తాయనే భావన ఉండేది. కానీ ఇప్పుడు గుండె సమస్యలతో యువకులు అకాల మరణాలకు గురవుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విష యం. ముఖ్యంగా, యువతలో గుండెపోటు సమస్యప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. చాలా మందికి తమకు ప్రమాదం ఉందని కూడా తెలియదు. యువ నిపుణులు, విద్యార్థులు, కార్మికులు వంటి వివిధ వర్గాల వారు కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతున్నారు.

జీవనశైలిలో మార్పులు

దేశంలో గుండెపోటు కేసులు పెరగడానికి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు దోహదపడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి ఫాస్ట్ఫుడ్, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలతో నిండిన ఆధునిక జీవనశైలి యువ తలో ఊబకాయం, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన కొవ్వునిల్వలకు (లిపిడ్ ప్రొఫైల్లో తేడాలు) దారితీస్తున్నా యి. యువత తమ దినచర్యలో ఎక్కువ భాగాన్ని పనిలో లేదా విశ్రాంతి పేరుతో కూర్చుని గడుపుతున్నారు. ఇది బరువు పెరగడానికి, పొగాకు వినియోగం, మాదకద్రవ్యాలు, మద్యం వాడకం మరొక ముఖ్య కారణం. ఉద్యోగాల్లో ఒత్తిడి, ఎక్కువ పని గంటలు, సరైన విశ్రాంతి లేకపోవడంవల్ల దీర్ఘకాలి కంగా ఒత్తిడి పెరిగి గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దీర్ఘకాలిక ఒత్తిడి అనేక విధాలుగా గుండె ఆరో గ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ను ఎదు ర్కొంటున్న యువకులకు, డిప్రెషన్ లేని వారితో పోలిస్తే, గుండె జబ్బులు వచ్చే
అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని కొత్త అధ్యయనాలు కనుగొన్నాయి. దీనికితోడు, వంశ
పారంపర్యంగా ప్రజలకు గుండె జబ్బులు వచ్చే అవకా శం ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన
అత్యవసర సేవలు, గుండె పరీక్షా కేంద్రాలు లేకపోవడం వల్ల చికిత్స అందించడంలో ఆలస్యం అవుతోంది.
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, గుర్తించని దీర్ఘకాలిక జబ్బులు అధిక సంఖ్యలో ఉన్నాయి.

ఒత్తిడిలు

అధిక రక్త పోటు, డయాబెటిస్ వంటివి చాలా మందిలో అసలున్నట్లు కూడా గుర్తించడం లేదు. ఒకవేళ గుర్తించినా20 శాతంకంటే తక్కువ మంది మాత్రమే వాటిని అదుపులో ఉంచుకుంటు న్నారు. ఈ ప్రమాదకరమైనపరిస్థితిని మార్చడానికి తక్షణమే అనేక చర్యలు తీసుకోవాలి. మొదటగా, పెద్దఎత్తున గుండె ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. గుండెఆరోగ్యం గురించి, దాని లక్షణాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారంచేయాలి. అంతేకా కుండా పనిప్రదేశాలు, పాఠశాలల్లో తగిన ఆరోగ్య చర్యలు తీసుకోవాలి. అంటే, ఆఫీసులు,స్కూళ్లలో సరైనపని వేళలు, ఒత్తిడిని తగ్గించే పద్ధతులు, ఆరోగ్యకర మైన ఆహారం అందుబాటులో ఉండేలాచూడాలి. తృణధా న్యాలు, లీన్ ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం హృద్రో గాలప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడు తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్దలందరికీ ప్రతివారం కనీ సం 150 నిమిషాల మితమైన వ్యాయామం చేయాలని సిఫార్సు చేసింది. ధూమపానం మానేయడం హృదయ సంబంధవ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆల్కహాల్ అధిక వినియోగం హృదయ సంబం ధిత వ్యాధులకు దోహదం చేయడంతో పాటు, రక్తపోటుకు కూడా దారితీస్తుంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో అత్యవసర ఆరోగ్య సేవలు, గుండె జబ్బుల మందులు తక్కువ ధరలో అందేలాచూడాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడంవల్ల
బరువుతగ్గడం, ఇతర సమస్యలు దూరమవు తాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి పేదలకు సబ్సిడీ
ఆరోగ్య సేవలు, ఉచిత స్క్రీనింగ్ క్యాంపుల నిర్వహ ణను తమ ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకోవాలి.

Heart attack :  జీవన ప్రమాణానికే కాటు.. గుండెపోటు
Heart attack : జీవన ప్రమాణానికే కాటు.. గుండెపోటు

దెబ్బతింటున్న జీవితాలు

గుండెపోటు ఇప్పుడు చిన్న, మధ్య వయస్కుల జీవితాలను దెబ్బతీస్తోంది. ఛాతీ నొప్పి, చేయి లేదా దవడ వరకు నొప్పిరావడం, అకస్మాత్తుగా ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలి. ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుంది. కుటుంబంలో గుండె జబ్బులు చరిత్ర ఉన్నా, జీవనశైలి సరిగా లేకపోయినా, ఈసీజీ, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి కీలకమైన పరీక్షలు చేయించుకోవడం చాలా అవస రం.
ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనం గుండె పోటు ప్రమాదాన్ని సగానికి తగ్గిస్తాయి. పొగాకును మానే
యడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కేవలం మందులు వాడ టం కంటే మెరుగైన ఫలితాన్నిస్తాయి. పెరుగుతున్న
ఈ మరణాలకు తక్షణమే పరిష్కారం చూపాలి. గుండె ఆరోగ్యం పై దృష్టి పెట్టడం, మనందరి ప్రవర్తనలో
మార్పురావడం రాబోయే దశాబ్దంలో అత్యంత కీలకం.

    – డి. జయరాం

    గుండెపోటు అంటే ఏమిటి?

    సాధారణంగా గుండెపోటు అని పిలువబడే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (MI), గుండె యొక్క కరోనరీ ధమనులలో ఒకదానిలో రక్త ప్రవాహం తగ్గినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు సంభవిస్తుంది, దీని వలన గుండె కండరాలకు ఇన్ఫార్క్షన్ (కణజాల మరణం) వస్తుంది.

    గుండెపోటుకు కారణాలు ఏమిటి?

    గుండె కండరాలలో కొంత భాగానికి రక్త ప్రవాహం నిరోధించబడినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది, చాలా తరచుగా కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD) కారణంగా ధమనులలో ఫలకం ఏర్పడుతుంది. గుండెపోటుకు ప్రధాన ప్రమాద కారకాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ధూమపానం, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం మరియు కుటుంబ చరిత్ర. తక్కువ సాధారణంగా, కరోనరీ ఆర్టరీలో తీవ్రమైన స్పామ్ వల్ల గుండెపోటు సంభవించవచ్చు.

    Read hindi news: hindi.vaartha.com

    Epaper : https://epaper.vaartha.com/

    Read Also:

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870