విజయవాడ : పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య భీమా(Health Scheme) అందుబాటులోకి వచ్చేలా రూపొందించిన ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ సమర్థ అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ-ఏబీ పీఎంజెఏవై పథకం హైబ్రిడ్ మోడ్లో అమలుకు పిలిచిన టెండరులో ఆర్ఎఫ్పీ, డీసీఏలో కొన్ని సవరణలకు ఆమోదం తెలి పింది. ప్రీబిడ్ సమావేశాల ద్వారా చిన్న చిన్న సవరణలకు టెండరు కమిటీకి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆయా ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ మేరకు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏటా రూ.5 లక్షల వరకు ఆదా యం ఉన్న పేద వర్గాలకు (బీపీఎల్) చెందిన కుటుంబాలకు రూ.2.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ మోడ్లో అంతకంటే ఎక్కువ అవసరమైతే రూ.25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Read also: ఇండిగో విమాన సిబ్బందికి మద్దతుగా సోనూ సూద్

ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీ
ఏపీఎల్ కుటుంబాలు (ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్టు స్కీం మినహా) రూ.2.50 లక్షల వరకు భీమా వర్తిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు భీమా కంపెనీలకు(Health Scheme) సెప్టెంబరు 9న ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. టెండరు నిబంధనల్లో మార్పులతో తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంంలో ఈహెచ్ ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్ స్కీం మినహా మిగిలిన అన్ని కుటుంబాలు యూనివర్సల్ హెల్త్ పాలసీ పరిధి లోకి వస్తాయి. పీఎం జేవై, ఎన్టీఆర్ వైద్యసేవ లబ్దిదారుల కుటుం బాల్లోని సభ్యులు ఈ పథకం పొందడానికి అర్హులు. ఏడాది పొడవునా అస్పత్రుల నమోదుకు ధరఖాస్తులు స్వీకరిస్తారు. ఏడాదికి రెండుసార్లు జాబితాలో నమోదు ప్రక్రియ జరు గుతుంది. భీమా కంపెనీలు పన్నులు మినహా యించి ప్రీమియం ధర చెల్లించవచ్చు క్లైయిమ్ రేషియో 120 శాతం దాటితే ప్రీమియం మించిన అదనపు ఖర్చులో 50 శాతం ట్రస్ట్ 50 శాతం భీమా కంపెనీ భరిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు(Hospitals) ప్రత్యేకంగా కేటాయించిన 521 వ్యాధులకు సంబంధించిన సేవలకు మొదట భీమా కంపెనీ భరిస్తుంది. బిల్లులు పరిశీలించి ట్రస్ట్ సొమ్ము చెల్లిస్తుంది. రాష్ట్ర జిల్లా, ఆస్పత్రుల స్థాయిలో ప్రస్తుతం సేవలందిస్తున్న వైద్య మిత్రులు, ట్రస్ట్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఒప్పంద సిబ్బందిని అవసరాల మేరకు భీమా కంపెనీ కొనసాగించాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: