విజయవాడ : దివిసీమ తన కర్మ భూమి అని, ఇక్కడ పొందిన ప్రేరణ మరువలేనిదని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) అన్నారు. కృష్ణాజిల్లా(Haryana Ex Haryana) అవనిగడ్డలో ఎంఎల్ఎ మండలి బుద్దప్రసాద్ అథ్వర్యంలో 1977 దివిసీమ ఉప్పెన 48వ వార్షిక సంస్మరణ సభ, మానవతాముర్తులకు దివ్యవందన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దత్తాత్రేయ విచ్చేశారు. మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా స్థానిక వంతెన కూడలి లోని ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారంతా 1977 ఉప్పెన చిత్ర ప్రదర్శనను తిలకించారు.
Read also: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 10వసారి ప్రమాణం..

జీవితాన్ని మార్చిన సహాయకచర్యాల అనుభవాలు
ఈ సందర్భంగా గాంధీక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో దత్తాత్రేయ(Haryana Ex Haryana) మాట్లాడుతూ… ఉప్పెన సమయంలో నాగాయలంక మండలం పర్రచివర, దిండి. సొర్లగొంది, మూలపాలెం, కోడూరు మండలంలో చేసిన సేవల జ్ఞాపకాలు తన హృదయానికి దగ్గరగా ఉంటాయని చెప్పారు. సహాయక చర్యల కోసం 6 నెలలు గడిపిన కాలం తన జీవితంలో గొప్ప మార్పు తెచ్చిం దన్నారు. ఆ ప్రేరణ మరువలేనిదన్నారు. ఎక్కడ చూసినా కుప్పలుగా ఉన్న శవాలు చూసి చలించి పోయానని, సామూహిక శవ దహన కార్యక్రమం నిర్వహించానని చెప్పారు. మండలి వెంకట కృష్ణారావు మంత్రిహోదాలో ఉన్నా రోజూ ముళ్ళబాటలో నడిచి,…కాళ్ళకు పుండ్లు పడినా లెక్కచేయకుండా సహాయక కార్యక్రమాల్లో ప్రజలకు అండగా నిలిచారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :