ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో కొంతమంది యువకుల ఆగడాలు హద్దుమీరాయి. నగరంలోని లీలామహల్ జంక్షన్ సమీపంలో ఉన్న అమెరికన్ బార్ వద్ద నిన్న రాత్రి ఆరుగురు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న తల్లి కూతుళ్ళను వేధించడం మొదలుపెట్టారు. యువకుల ఈ అమానుష చర్యను గమనించిన స్థానికులు కోపంతో ఊగిపోయారు. వెంటనే వారిలో ముగ్గురిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ఈలోగా మరో ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా పారిపోతున్న నిందితులను పట్టుకొని లాటితో కొట్టారు. ఆ తరువాత వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ యువకులు ఈ ఘటనకు ముందు కూడా బార్లో గొడవపడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికులను, నెటిజన్లను ఆందోళనకు గురిచేసింది.
Read More : పాము కరిచిందని తల కొరికి పక్కనే పెట్టుకొని నిద్రపోయడు