ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీబాయి (27) ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో(Guntur Crime) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భర్త వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రారంభ దర్యాప్తులో బయటపడుతోంది.
Read Also: Crime : తిరుపతి దగ్గర భయానక దృశ్యం – ముగ్గురు అనుమానాస్పద మృతి

నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడిని మాధురి ప్రేమించి 2025 మార్చిలో వివాహం చేసుకుంది. కానీ పెళ్లైన కొద్దికాలానికే ఆమె భర్త వేధిస్తున్నాడని మాధురి తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో పోలీసులు సహకారంతో మాధురిని రెండు నెలల క్రితం తాడేపల్లిలో ఉన్న పుట్టింటికి తీసుకువచ్చారు. అయితే ఆదివారం రాత్రి మాధురి తన గదిలోని బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు(Guntur Crime) ఘటనాస్థలానికి చేరుకుని శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. మాధురి తల్లి లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రారంభ సమాచార ప్రకారం, మాధురి గర్భిణీ అయినట్లు, ఇటీవలి రోజులుగా భర్త ప్రవర్తన కారణంగా తీవ్ర ఒత్తిడికి గురైందని తెలుస్తోంది.
చిన్నరాముడు చేసిన ఆరోపణలు
తన కుమార్తెను ప్రేమ పేరుతో మోసం చేశాడని చిన్నరాముడు తీవ్ర ఆరోపణలు చేశారు.
- ఉద్యోగం ఉందని రాజేష్ నమ్మించి, మహానందిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడని
- తరువాత పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి జరిపారని
- ఆ తర్వాత నుంచి అదనపు కట్నం తీసుకురావాలని మాధురిని వేధించాడని
- ప్రాణహానికి గురిచేస్తానని బెదిరించేవాడని
- మాధురికి భర్త అనుమతి లేకుండా ఫోన్ చేయడానికి కూడా అవకాశం ఉండేదని ఆయన బాధ వ్యక్తం చేశారు.
చిన్నరాముడు తెలిపిన వివరాల ప్రకారం, తమ కుమార్తె మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు, రెండు నెలల క్రితం అత్తారింట్లో ఉండలేనని చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. “ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాం. మా కుమార్తె చివరికి రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని ఆకాంక్షతోనే ఉందని” చిన్నరాముడు కన్నీటి పర్యంతమయ్యారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: