తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో యువతులు మోసపోవడం పెరుగుతున్న వేళ, గుంటూరులో(Guntur crime) చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు యువకులు మత్తుపదార్థాలకు అలవాటు చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
Read Also: Sangareddy Crime: నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

సోషల్ మీడియా పరిచయంతో మొదలైన వ్యవహారం
పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు(Guntur crime) చెందిన 17 ఏళ్ల బాలిక స్థానిక కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న సీనియర్‌తో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన ఆ యువకుడు ఆమెను తనవైపు తిప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు మత్తుపదార్థాల అలవాటు చేసి, తన గదికి పిలిపించి డ్రగ్స్(Drugs) ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. మత్తులో ఉన్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు కూడా పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వ్యవహారం బాలిక తల్లి ఆత్మహత్యాయత్నం చేయడంతో బయటపడింది. హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న తల్లి ఇటీవల కుమార్తె ఫోన్ పరిశీలించగా, ఆ యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కనిపించాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె కుమార్తెను ప్రశ్నించగా, తల్లిదండ్రులపై దాడి చేసినట్టు సమాచారం. అనంతరం తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించగా, ఆమెను గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు.
విషయం తెలుసుకున్న ఈగల్ విభాగ ఐజీ ఆకే రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆసుపత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు. ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుని సమగ్ర దర్యాప్తు చేపడతామని ఐజీ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా మైనర్‌ను డ్రగ్స్‌కు బానిస చేసిన అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, బాలికకు అవసరమైన చికిత్సను ఆడిక్షన్ సెంటర్ ద్వారా అందిస్తామని చెప్పారు.
నిందితుడు విద్యార్థి సంఘ నాయకుడని అనుమానం
ఎస్పీ ఆదేశాల మేరకు తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో లాలాపేట సీఐ శివప్రసాద్ ప్రత్యేక విచారణ ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో డ్రగ్స్ అలవాటు చేసిన యువకుడు ఓ రాజకీయ పార్టీకి చెందిన విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం వెల్లడైంది. బాలిక అతడితో ప్రేమలో ఉందని తెలుసుకున్న తల్లిదండ్రులు వేరే వివాహ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబంలో విభేదాలు పెరిగినట్టు పోలీసులు గుర్తించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: