గుంటూరు (Guntur) జిల్లాలోని దాచేపల్లి మాచర్ల జాతీయ రహదారి 167AD వెంబడి ఉన్న గురజాల, మాచర్ల, రెంటచింతల పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ఇచ్చింది. ఈ పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, రోడ్లు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు NHAI రూ.50 కోట్ల నిధులు కేటాయించింది. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవగా, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.
Read also: Nara lokesh: పుట్టపర్తిలో 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్

A great opportunity for the towns .
Gunturu: కొత్తగా నిర్మించిన బైపాస్ మార్గాలతోపాటు, పట్టణాల మధ్య ప్రధాన రహదారులను మరింత విస్తరించనున్నారు. రోడ్లకు ఇరువైపులా డ్రెయిన్లు, సైడ్ పాత్‌లు నిర్మించడం ద్వారా ట్రాఫిక్ వ్యవస్థ మొత్తం మెరుగుపడనుంది. తొమ్మిది నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్ణయించారు.
ఏ పట్టణంలో ఏమేం పనులు?
మాచర్ల
సుమారు 4.9 కిమీ రోడ్డును ఇరువైపులా 10 అడుగుల మేర విస్తరించనున్నారు. రహదారికి రెండు వైపులా కొత్త డ్రెయిన్లు కూడా నిర్మించబడతాయి.
రెంటచింతల
4 కిమీ ప్రధాన మార్గాన్ని 15 అడుగుల మేర విస్తరిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో సుమారు 500 మీటర్ల డ్రెయిన్ నిర్మాణం ఉంటుంది.
గురజాల
ప్రస్తుతం ఉన్న 4-లైన్ రోడ్డు 4.2 కిమీల మేర మరింత విస్తరించబడుతుంది. ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు కొత్త డ్రెయిన్లు, సైడ్ విస్తరణ చేపడతారు. ఈ పనులు పూర్తవడంతో బైపాస్ మార్గాలు, పట్టణ కేంద్రాలు మరింత సులువు రవాణా సదుపాయాలతో మారబోతున్నాయి. స్థానికులకు, వాహనదారులకు, వాణిజ్య రవాణాకు పెద్దగానే లాభం చేకూరనుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :