భావోద్వేగాల మధ్య రైల్వే పూర్వ గార్డుల ఆత్మీయ కలయిక గుంతకల్లు Guntakal రైల్వే : వారుకొన్ని దశాబ్దాలపాటు వృత్తి పట్ల బాధ్యత, నిబద్ధతలతో కలిసి విధులు నిర్వర్తించి రైల్వే అభివృద్ధిలో పాలుపంచు కున్నవారు. ఉద్యోగ విరమణ చేసి దశాబ్దాల విరామం అనంతరం తాము ఒకరినొకరు కలిసి యోగాక్షేమాలు తెలుసుకొని అలనాటి తమ తమ అనుభవాలను మరోసారి నెమరువేసుకుంటు ఆనందంగా గడపటం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ Division లో పనిచేసిన అప్పట్టి గార్డులు, ట్రైన్ మేనేజర్లు ఉద్యోగ విరమణ చేసిన అనేక సంవత్సరాలకు దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన ఈ చారిత్రాత్మక కార్యక్రమం స్థానిక రైల్వే ఇన్స్ టిట్యూట్ ఆనందోత్సాహాలమధ్య, ఆడంబరంగా జరిగింది పూర్వ గార్డుల సమ్మేళనం కార్యక్రమం.
Vaikuntha Ekadashi: వైకుంఠ ద్వార దర్శనం రెండా? పదిరోజులా?

Guntakal railway
భారతీయ రైల్వే చరిత్రలో మొట్ట మొదటిసారిగా నిర్వహించిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో అలనాటి పూర్వపు గార్డులు శ్రీనివాస మూర్తి, నీలకంఠారెడ్డి, రంగనాయకులు, జి. రామచ ద్రారెడ్డి, ఎస్.ఎం. బాషా, యస్ మొహమ్మద్ అలీ, వాఘేశ్వరన్, బి.శ్రీనివా సులు, ధర్మన్న, రామనాయక్, శ్రీధరన్, చిట్టిబాబు, రవికుమార్, వై.పి. ఆంజనే యులతో పాటు అధిక సంఖ్యలో సీనియర్ గార్డులు ఈఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గోని తమ తమ అనుభవాలను, అనుబంధాలను ఆనందోత్సాహాలు, భావోద్వేగాలకు లోనయ్యారు. తమ సహచ రులను, మితృలను కలుసుకొని అలనాటి తమ తీపి, మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు… చెదరని బెదరని చెలిమే తమది.. చెరగని తరగని స్నేహం friendship తమది.. జీవితమంతా విడదీయలేని వాడని వీడని బంధం తమది.. అంటూవృత్తిపట్ల నిబద్ధతలతో చక్కగా ఒక్కటిగా కలిసి మెలిసి పనిచేసినరోజులను గుర్తు చేసుకున్నారు.
మల్లి ఎప్పుడో
ప్రస్తుతం ఉన్న పలువురు గార్డులు బరువెక్కిన వేదనాభరిత హృదయంతో భావోద్వేగానికి లోను కావడం చూపరులను కంటతడి పెట్టించింది. ఈసందర్భంగా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు రాబిన్ థామస్, వాఘేశ్వరన్, హనుమంతరావు, ధన్ రాజ్, సాయిశేఖర్ సభ్యులు తమ సీనియర్ లను భక్తిశ్రద్ధలతో ఘనంగా శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి పాదాభివందనాలుచేసి ఆశీస్సులు పొందారు… బతుకు తెరువుకై వెళ్తున్నాం.. మల్లి ఎప్పుడో ఎక్కడో కలుసుకుందా మంటూ టాటా చెప్పుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: