తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు (Global Summit 2025) భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.గ్లోబల్ సమ్మిట్‌లో (Global Summit 2025) పాల్గొన్న, మాజీ ఎంపీ, అమర్‌రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని అన్నారు.
Read Also: Global Summit 2025: తొలి రోజు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు

మా కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్
సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలకు మంచి సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీలో రూ.9వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, తమ కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అని పేర్కొన్నారు. మరోవైపు అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: