విజయవాడ : ప్రముఖ కవి(Award) గంటేడ గౌరునాయుడుకు తాపీ ధర్మారావు నాయుడు పురస్కారం లభించింది. బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ 95 వార్షికోత్సవం గుంటూరు బ్రాడీపేటలోని కొరటాల సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ప్రముఖ కవి పుప్పాల శ్రీరామ్ సభకు అధ్యక్షత వహించారు. ఫౌండేషన్ అధ్యక్షులు బండికల్లు జమదగ్ని, ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు నాయుడు పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడుకు(Ganteda Gaurunaida) అందజేశారు.
Read also: డిప్యూటీ స్పీకర్ నియామకం ఇంకెప్పుడు?

సాహిత్య, కళా రంగ సేవలకు ఘన సత్కారం
తాపీ ధర్మారావు(Award) సాహిత్య ప్రతిభను సాహితీవేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లు వివరించారు. పురస్కార గ్రహీత గంటేడ గౌరునాయుడు సాహిత్య ప్రస్థానాన్ని సాహితీ వేత్త ఎస్.ఎమ్. సుభానీ సభకు తెలియజేశారు. ఇటీవల నిర్వహించిన కథల పోటీల్లో బహుమతి పొందిన కథలను విశిష్ట అతిధి శిరంశెట్టి కాంతారావు విశ్లేషించారు. ఆత్మీయ అతిధులుగా విచ్చేసిన మల్లెతీగ పత్రిక సంపాదకులు కలిమిశ్రీ, విశాఖ సంస్కృతి పత్రిక సంపాదకులు శిరేల సన్యాసి రావు ఫౌండేషన్ సేవలను కొనియాడారు. అనంతరం కథల పోటీ విజేతలు నందిరాజు పద్మలతా జయరాం, వాడపల్లి పూర్ణ కామేశ్వరి, కైకాల సుమలతలను నగదు పురస్కారాలతో జమదగ్ని కుటుంబ సభ్యులు సత్కరించారు. వివిధ రంగాలలో సేవలందించిన వడ్రాణం హరిబాబు, డాక్టర్ గాజుల రామకృష్ణ, డాక్టర్ నెల్లూరి బ్రహ్మయ్య, నారదాసు శ్రీహరిరావు, బండ్లమూడి గాంధీ, బిళ్ళా అశోక్, మిరియాల గోపీ కుమార్, రామరాజు లక్ష్మీ శ్రీనివాస్, మేడిశెట్టి సుభద్రా కృష్ణ, ఉప్పు వెంకట రత్తయ్యలను స్ఫూర్తి పురస్కారాలతో సత్కరించారు. సభా ప్రారంభంలో నిర్వహించిన సంగీత విభావరి ఆహూతులను అలరించింది. నగరానికి చెందిన కవులూ, రచయితలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: