కాణిపాకం Ganesh Festival : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉభయదేవేరులతో కలసి అశ్వవాహనంపై కాణిపాకం (Kanipakam) పురవీధుల్లో విహరిస్తూ భక్తులను అలరించారు. ఈకార్యక్రమానికి బొమ్మనముద్రం, తిరువణంపల్లె, చింతమాకులపల్లె, కారకాంపల్లె, గ్రామాదుల గోనుగుంట బలిజవంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉభయదారులచే ఉదయం స్వామివారికి అష్టోత్తర శతకలశాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే రాత్రి సిద్ది బుద్ధి సమేత గణనాధుడు సర్వాలంకృతులై అలంకార మండపంలో వేదపండితులు మత్రోచ్చారణ నడుమ అర్చకస్వాముల పూజలందుకున్న అనంతరం రంగు రంగుల విద్యుద్దీపాలు, వివిధరకాల పుష్పాలతో దేదీప్యమానంగా అశ్వవాహనంపై అలంకరించిన అధిరోహించి వణిగ మంగళవాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనల నడుమ కాణిపాకం గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయహస్తం అందించారు. అసందర్భంగా భక్తులు నారికేళ కర్పూర హారతులతో మొక్కులను తీర్చుకున్నారు.. కమనీయం వరసిద్దుని కళ్యాణం కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి తిరుకళ్యాణం కమనీయంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి కాణిపాకం, తిరువణంపల్లె వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.
ఈమేరకు స్వామివారి తిరుకళ్యాణం నిర్వహించడానికి తల్లిదండ్రులైన శివపార్వతులు పగలు కాణిపాకం పురవీధుల్లో భిక్షాటన చేశారు. ఈసందర్భంగా అలంకృతులైన శివపార్వతులు మణికంఠేశ్వరాలయంలో అర్చకస్వాముల పూజలందుకున్న అనంతరం కాణిపాకం, కాకర్లవారిపల్లె గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ తమ పుత్రుడు వరసిద్ధుని తిరుకళ్యాణానికి భిక్షాటన చేశారు. అనంతరం రాత్రి ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసి, దేదీప్యమానంగా అలంకరించిన కళ్యాణ వేదికపై సిద్ధి, బుద్ధి, సమేత గణనాధుని ఉత్సవమూర్తులను వుంచి ఆలయ అర్చకులు (Temple priests) వేదపండితుల మంత్రోచ్చరణ నడుమ ఆర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే నూతన వధూవరులైన సిద్ధి, బుద్ది గణనాధులకు పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం గావించి స్వామివారికి పాదపూజ చేశారు. అనంతరం అశేష భక్తజనం నడుమ స్వామివారిచే ఉభయదేవేరులకు మాంగల్యదారణ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లు తలంబ్రాలు పోసుకునే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కాణిపాకం బ్రహ్మోత్సవాలలో అశ్వవాహన సేవ ఎప్పుడు జరిగింది?
గురువారం ఉభయదేవేరులతో కలసి అశ్వవాహన సేవ జరిగింది.
వరసిద్ధుని తిరుకళ్యాణం ఎక్కడ నిర్వహించారు?
ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో అత్యంత వైభవోపేతంగా తిరుకళ్యాణం నిర్వహించారు.
Read hindi news : hindi.vaartha.com
Read also :