విజయవాడ : సమష్టి కృషితో గాంధీ కొండ చారిత్రక ఔన్నత్యానికి పునర్వైభవం వచ్చిందని పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధులు అన్నారు. 50 రోజుల్లోనే ఆధునీకరణ పనులతో కొండ కొత్త శోభను సంతరించుకుందన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ, సమష్టి కృషితో దశల వారీగా కొండ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 156వ గాంధీ జయంతి Gandhi Jayanti వేడుకలు నగరంలోని గాంధీ. హిల్స్ పై జరిగాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశతో పాటు గాంధీ హిల్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొని మహాత్మునికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ఎంత సుందర నగరమో గాంధీహిల్ పైనుంచి చూస్తే తెలుస్తుందన్నారు. వైబ్రెంట్ విజయవాడ నినాదంతో నగర అభివృద్ధికి కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. గాంధీ హిల్ ఫౌండేషన్ చైర్మన్ డా. గాంధీ పీసీ కాజా మాట్లాడుతూ… స్వల్ప
వ్యవధిలోనే లిఫ్ట్, ర్యాంప్, హరిత విస్తీర్ణం పెంపు, సుందరీకరణ, వ్యూ పాయింట్, టాయ్ ట్రెయిన్ ట్రాక్ మరమ్మతులు తదితర అభివృద్ధి పనులను పూర్తిచేశామని తెలిపారు.
TamilNadu: ఏపీ యువతిపై గ్యాంగ్‌రేప్.. కానిస్టేబుళ్ల ను విధుల నుంచి సస్పెండ్ చేసిన డీఎంకే ప్రభుత్వం

Gandhi Jayanti
గాంధీ కొండ
మహాత్ముని ఆశయాల స్ఫూర్తితో గాంధీ కొండ గాంధీ గ్లోబల్ సెంటర్గా ఎదగాలని కోరుకుంటున్నానని.. దీన్ని సాకారం చేసేందుకు ఫౌండేషన్ చేసే నిర్మాణాత్మక కృషిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ… గాంధీ కొండ వెనుక విజయవాడ చారిత్రక ఔన్నత్యం ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటం పరంగా విజయవాడ పాత్రకు గాంధీ కొండ గొప్ప దర్పణమని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి మాట్లాడుతూ… యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు, సన్మార్గంలో నడిపించేందుకు గాంధీ కొండ నాంది కావాలన్నారు.
ఇదో విజ్ఞాన కేంద్రంగా భాసిల్లాలని కోరుకుంటున్నట్లు శాసనసభ్యులు సుజనా చౌదరి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ… గాంధీ కొండ గొప్ప విజ్ఞాన కేంద్రమని, మహాత్ముని ఆశయాల స్ఫూర్తిగా ముందడుగు వేసేందుకు ఇదో గొప్ప వేదికని అన్నారు. ఈ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళి. అర్పించారు. Gandhi Jayanti డా. రావి శారద రాసిన తెలుగు నేలపై గాంధీజీ అడుగుజాడలు, జి.వి. పూర్ణచందు రాసిన ఆంధ్ర గాంధీయం పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గాంధీ హిల్ ఫౌండేషన్ కార్యదర్శి వై.రామచంద్రరావు, గాంధీ హిల్ ఫౌండేషన్ మాజీ చైర్మన్ గోకరాజు గంగరాజు, ఏపీ గాంధీ స్మారక నిధి వైస్ చైర్మన్ డా. చక్రపాణి, గాంధీ హిల్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ డా. జంధ్యాల శంకర్, ఫౌండేషన్ సలహాదారులు కేవీఎల్ హరినాథ్, ప్రొఫెసర్ బి. పాండురంగారావు. తదితరులు పాల్గొన్నారు.
గాంధీ కొండలో ఏ కార్యక్రమం జరిగింది?
156వ గాంధీ జయంతి వేడుకలు విజయవాడలో గాంధీ హిల్స్‌పై నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు?
కలెక్టర్ డా. జి. లక్ష్మీశ్, గాంధీ హిల్ ఫౌండేషన్ సభ్యులు, ఎంపీ కేశినేని శివనాథ్, అవనిగడ్డ శాసనసభ్యులు బుద్ధప్రసాద్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: