విజయవాడ : కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,121 కోట్లు వెంటనే పంచాయతీలకు విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బుధవారం (WEDNESDAY) ఏపీ సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు లేఖ రాశారు. రాజ్యాంగం ప్రసాదించిన మూడు దొంతరల అధికార వ్యవస్థలో దిగువనున్న స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయించడంలో ఇప్పటికీ లోపాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకీ కేంద్రీకరణ బలపడుతోంది. అభివృద్ధిలో స్థానిక సంస్కలెన పంచాయితీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కాని కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వ కేంద్రీకృత విధానాల వలన పంచాయతీల్లో అభివృద్ధి పడకేసింది. రాష్ట్రంలో సర్పంచులు పార్టీయేతర ప్రాతిపదికపై ఎన్నికై 4 సంవత్సరాలు దాటుతోంది. ఎన్నో ఆశలతో గ్రామాల్లో అభివృద్ధి (Development) చేద్దామనే ఉత్సాహంతో ఎన్నికైన సర్పంచులు నిధుల్లేక, ప్రభుత్వ ప్రోత్సాహం లేక అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఎస్.సి, ఎసిటి, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన సర్పంచులు 50 శాతం పైగా ఉన్నారు. వారందరూ అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయిస్తే, వాటికి చెందిన బిల్లులు కూడా గత ప్రభుత్వం విడుదల చేయలేదు. పంచాయితీలకు ఇవ్వవలసిన ఆర్ధిక సంఘం నిధులు ఇవ్వలేదు.

అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్ధిక సంఘం నిధులను విద్యుత్ బకాయిల పేరుతో దారిమళ్ళించారు అని వి.శ్రీనివాసరావు లేఖలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదట విడత నిధులు విడుదల చేసినా, గత 6 నెలలుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15 ఆర్థిక సంఘం రెండవ విడత నిధులు రూ.1121 కోట్లు విడుదల చేయకపోవడంతో వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటి కోసం చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. అయినా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమస్యల పరిష్కారానికి పంచాయతీ శాఖ బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్ శ్రద్ధ చూపాలని వి. శ్రీనివాసరావు లేఖలో కోరారు. ఈ క్రింది చర్యలు తీసుకొని స్థానిక సంస్థలను, గ్రామ స్వపరిపాలనను ప్రోత్సాహించాలని వి. శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ ని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుండి 6 నెలల క్రితం విడుదలెన 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయితీల ఖాతాలకు వెంటనే విడుదల చేయాలన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :