हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest Telugu News : Food safety : ఆహార భద్రతతోనే దేశ సంక్షేమం

Sudha
Latest Telugu News : Food safety : ఆహార భద్రతతోనే దేశ సంక్షేమం

గాలి, నీరు తర్వాత మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకమైన మూడవ వనరు ఆహారం. ప్రతి పౌరుడికి వైవిధ్యమైన పోషకారం అందుబాటులో ఉంచడం, సరైన పోషణ,ఆర్థిక స్థోమత, ఆహార భద్రత (Food safety)కల్పించవలసిన బాధ్యత ప్రతి దేశంపై ఉంది. ప్రపంచవ్యాప్తంగా జనాభాకు సరిపడా ఆహారం ఉత్పత్తి అవుతున్నప్పటికీ, ఆకలి కేకలు మాత్రం ఆగడం లేదు. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేక, తక్కువ ఖరీదైన, అనారోగ్యకరమైన ఆహారాలపై ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితికి అనేక అంశాలు దోహదపడుతున్నప్పటికీ, వాతావరణ అననుకూ లత, సంఘర్షణలు, ఆర్థిక మాంద్యం, అసమానతలు, ఆహార వ్యర్థం వంటివి ప్రధానంగా పరిగణించవచ్చు. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ‘ప్రపంచ ఆహార పోషకా హార స్థితి సోఫీ 2025’ నివేదిక ప్రకారం, 2024లో ప్రపంచ జనాభాలో 8.2 శాతం అంటే దాదాపు 67.3 కోట్ల మంది దీర్ఘకాలిక ఆకలితో సతమతమవుతున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 51.2 కోట్లకు తగ్గవచ్చని అంచనా. ఇందులో 60 శాతం మంది ఆఫ్రికాలో కేంద్రీ కృతం కావచ్చు అని నివేదిక
పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 280 కోట్లకు పైగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితి పోషకాహార లోపానికి ప్రధాన కారణంగా పరిణమించింది. ప్రతీ ఒక్కరూ సరిపడా ఆహారం తీసుకునే హక్కును మానవ హక్కుగా గుర్తించారు. ఈ సందర్భంగా, వ్యవసాయ ఆహార ఉత్పత్తిని వృద్ధి చేయడం, అందరికీఆహార భద్రత (Food safety)కల్పించడం, పోష కాహార లోపాన్ని తగ్గించడం, దానివల్ల సంభవించే మరణాలను నివారించడం, ఆహార వ్యర్థాన్ని కనిష్టం చేయడం వంటి లక్ష్యాలనుచేరుకోవడానికి ప్రతి దేశం కృషి చేయాలి. ఈ దిశగా ప్రభుత్వేతర ప్రయత్నాలకు కూడా ప్రోత్సాహం అందించాలి.

 Food safety :  ఆహార భద్రతతోనే దేశ సంక్షేమం
Food safety : ఆహార భద్రతతోనే దేశ సంక్షేమం

సోఫీ నివేదిక ప్రకారం

సోఫీ నివేదిక తెలిపిన దాని ప్రకారం మన దేశంలో 17.20 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. 2006లో 24.3 కోట్ల మందితో పోలిస్తే ఇది మెరుగుదల అయినప్పటికీ, మనదేశం ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 48వస్థానంలో, ఆసియాలో 7వ స్థానంలో ఉంది. సుమారు 42.9మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు. ఆహార ధరలు, కొను గోలు శక్తి మధ్య ఉండే అంతరం పెరగడమే దీనికి కారణం, ఇది దీర్ఘకాలిక ఆహార అభద్రత (Food safety)ను సూచిస్తోంది. పోషకాహార లోపం ఇతర లక్షణాలను పరిశీలిస్తే, 18.7 శాతం మంది అంటే సుమారు2.1 కోట్ల మంది పిల్లలు తక్కువ బరువు తో ఉన్నారు. అలాగే సుమారు 3.74 కోట్ల మంది పిల్లలు వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవడం దీర్ఘకాలిక పోషకాహార లోపానికి నిదర్శనం. 15-49 ఏళ్ల మహిళల్లో 53.7శాతం అంటే సుమారు 20.3 కోట్ల మందికి రక్తహీనత పీడిస్తోంది. ఈ విషయంలో మనదేశం ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. ఒకవైపు పోషకాహార లోపం తీవ్రంగా ఉండగా, మరో వైపు అధిక పోషకాహారం సమస్య కూడా పెరుగుతోంది. అధిక బరువు ఉన్న పిల్లలు 42 లక్షల మంది ఉన్నారు. గత దశాబ్దంలో స్థూలకాయం ఉన్న పెద్దల సంఖ్య రెట్టింపు అయి, ఇప్పుడు 7.14 కోట్లకు చేరుకుంది. వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవడం వలన మానసిక అభివృద్ధి
కుంటుపడి, విద్యా విషయక పనితీరు తగ్గుతుంది. మరోవైపు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం రోగనిరోధక శక్తిని బలహీనపరిచి, వ్యాధులు తీవ్రతను పెంచుతుంది. ఇక అధికబరువు వలన హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. సరసమైన, ఆరోగ్యకర మైన ఆహారాలు అందుబాటు లోపం దేశంఅంతటా విస్త రించి ఉంది.

వ్యవసాయామె ఆధారం

దేశజనాభాలో 60శాతం పైగా వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత తగ్గ డం, జనాభా పెరుగుదల వలన వ్యవసాయ భూములు తగ్గిపోవడం వంటి సవాళ్లను ఈ రంగం ఎదుర్కొంటోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 70 శాతం కంటే ఎక్కువ మంది పల్లెల్లో నివసిస్తున్నారు. అయినా
అనేక కారణాల వల్ల వ్యవసాయం కుంటుపడింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో కరవు నిత్యం తాండవిస్తూనే ఉంది. ఆసియాలో దాదాపు 60 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అదే ఆఫ్రికాలో ఆ శాతం 75 దాటింది. ఆర్థిక సమస్యల కారణంగా దేశంలోని అనేక కుటుంబాల లో, ముఖ్యంగా పిల్లలకు, పోషకాహారం అందుబాటులో ఉండటం లేదు. పోషకాహార లోపం, ఆహార అభద్రత ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. పోషకాహార వైరుధ్యానికి మూలకారణాలను పరిశీలిస్తే దేశం ఆహార ఉత్పత్తిలో ముందంజలో ఉన్నప్ప టికీ, మెజారిటీ ప్రజలు పోషక విలువలున్న పండ్లు, కూర గాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేకపోవడమే మనదేశంలో పోష కాహార వైరుధ్యాన్ని సూచిస్తోంది. పేదరికం కారణంగా కోట్ల మంది ప్రజలు కేవలం అధిక క్యాలరీలున్న బియ్యం, గోధు మల వంటి ప్రధాన ఆహారధాన్యాలపై మాత్రమే ఆధారప డక తప్పడం లేదు. దీనివల్ల వారికి తగినన్ని విట మిన్లు, ఖనిజాలు అందక ‘దాగిఉన్న’ఆకలి’ అనే సమస్య ప్రబలుతోం ది. ముఖ్యంగా లింగ అసమానత వలన, కుటుంబంలో మహి ళలు, బాలికలకు ఆహారపంపిణీలో వివక్ష ఏర్పడి వారి ఆరో గ్యం దెబ్బతింటోంది.మరోవైపు, అపరిశుభ్రత, సరియైన పారిశుధ్య లోపంవల్ల ప్రజలు తరచుగా వ్యాధుల బారినప డుతూ, తీసుకునే ఆహారంలోని పోషకా లను శరీరం సరిగా గ్రహించలేకపోతోంది.

 Food safety :  ఆహార భద్రతతోనే దేశ సంక్షేమం
Food safety : ఆహార భద్రతతోనే దేశ సంక్షేమం

దృష్టి సారించిన జాతీయ మిషన్

ఆహారం, పోషక భద్రతకు సంబంధిం చిన పథకాలు మనదేశంలో అత్యంత కీలకమైనవి. వాటిలో ప్రధానమైనవిపరిశీలిస్తే జాతీయ ఆహార భద్రతాచట్టం ప్రధానమైంది. దీనికింద పేదవారికి చౌకదుకాణాల ద్వారా చాలా తక్కువ ధరకే ఆహార ధాన్యాలను అందిస్తున్నారు. పీఎం పోషణ్ పథకం బడికెళ్ళే పిల్లలందరికీ ఉచితంగా వేడి భోజనం అందిస్తోంది. పోషణ్ అభియాన్ అనేది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపాన్నితగ్గించడానకి దృష్టి సారించింది జాతీయ మిషన్. మనదేశం ఎదుర్కొంటున్న పోషకాహార వైరుధ్యాన్ని పరిష్కరించడానికి సమగ్రమై న, బహుళ అంచెల వ్యూహాలు తప్పనిసరి. కేవలం కడుపు నింపే ఆహారంపై కాకుండా, సమతుల్యమైన, విభిన్నమైన ఆహార ప్రాధాన్యతకు దృష్టి సారించాలి. ఇందులో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, పాల ఉత్పత్తులు చేర్చబడాలి. ముఖ్య మైన విటమిన్లు, మినరల్స్ తో ఆహారపదార్థాలను సుసంప న్నం చేయడం ద్వారా లోపాలను నిర్మూలించవచ్చు. పోష కమైన ఆహారం అందరికీ అందుబాటులోకి రావాలంటే వ్యవ సాయ ఉత్పాదకతను పెంచాలి,పేదరికం, అసమానతలను లక్షిత జోక్యాలతో తగ్గించాలి. పోషకాహారానికి సంబంధించి న అవగాహన, విద్యను విస్తరించడం చాలాకీలకం. అలాగే సరైన ఆహార నాణ్యతను నిర్ధారించడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం వంటివి ఈ సంక్లిష్ట సమస్యను పరిష్క రించడానికి అత్యవ సరం. ప్రొటీన్లు అధికంగా ఉండే సోయాబీన్స్, కాయధాన్యాలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు మొదలైన ఆహార ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పోషకాహార లోపాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

-డి. మోహన రావు

ఆహార భద్రత అంటే ఏమిటి ?

ఆహార భద్రత (లేదా ఆహార పరిశుభ్రత) అనేది ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాన్ని నివారించే మార్గాల్లో ఆహారాన్ని నిర్వహించడం, తయారు చేయడం మరియు నిల్వ చేయడం గురించి వివరించే శాస్త్రీయ పద్ధతి/విభాగంగా ఉపయోగించబడుతుంది.

ఆహార భద్రత ప్రాముఖ్యత?

జీవితాన్ని నిలబెట్టడానికి మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి తగినంత మొత్తంలో సురక్షితమైన మరియు పోషకమైన ఆహారం అందుబాటులో ఉండటం కీలకం . హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు లేదా రసాయన పదార్థాలు కలిగిన అసురక్షిత ఆహారం అతిసారం నుండి క్యాన్సర్‌ల వరకు 200 కంటే ఎక్కువ వ్యాధులకు కారణమవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870