విజయవాడ Flood Alert : కృష్ణానదికి వరద పోటెత్తుతోంది.. దాంతో అధికారులు విజయవాడ ప్రకాశం బ్యారేజీవద్ద (Vijayawada Prakasam Barrage) మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీకి ప్రస్తుతం 3.91లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగు తోంది. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం నాటికి ఇన్ 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. బ్యారేజీ 69 గేట్లు ఎత్తి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పైనుండి చేరుతోన్న వరద నీటి కారణంగా ప్రకాశం బ్యారేజ్వద్ద కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇది 5 లక్షల క్యూసెక్కులు వరకు చేరవచ్చని అధికారులు భావిస్తున్నారు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండడంతో.. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు.. కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దు” అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖ జైన్ ఒక ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు.

వాయుగుండం ప్రభావంతో గడచిన 24 గంటల్లో.. పాడేరులో 16 సెంమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రమంతటా ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు-అలాగే కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం (Cyclone in the Bay of Bengal) మంగళవారం మధ్యాహ్ననికి దక్షిణ ఒడిశా వద్ద తీరం దాటనుంది. ఈ క్రమంలో.. గడిచిన 24 గంటల్లో ఎపిలో కుండపోతా వానలు కురిశాయి. నిన్న రాత్రి నుంచి వానలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఈరోజు అక్కడక్కడ భార్ వానలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :