కోనసీమ జిల్లాలో జరిగిన బ్లోఅవుట్ ఘటనకు(Fire Incident) సంబంధించిన మంటలను ఒక్కసారిగా ఆర్పకుండా, క్రమంగా తీవ్రత తగ్గించే విధంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బ్లో క్యాపింగ్ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకా సుమారు వారం రోజుల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు.
Read also: ONGC: ఇంకా అదుపులోకి రాని ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఅవుట్ మంటలు

ఈ ఘటనలో గ్యాస్(Fire Incident) పూర్తిగా వ్యాపించకపోవడం వల్ల ప్రమాద తీవ్రత కొంత మేర తగ్గిందని కలెక్టర్ పేర్కొన్నారు. గ్యాస్ లీక్ అయి విస్తృతంగా వ్యాపించి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని ఆయన అన్నారు. ప్రస్తుతం పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తూ, భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
మంటల కారణంగా సుమారు 100 కొబ్బరిచెట్లు దగ్ధమయ్యాయని, అలాగే రెండు ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనలో నష్టపోయిన స్థానికులు, రైతులకు ప్రభుత్వం తరఫున తగిన పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ మహేశ్ కుమార్ భరోసా ఇచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: