Vijayanagaram district news: విజయనగరం జిల్లాలో గుండె కలచివేసే ఘటన చోటుచేసుకుంది. తెల్లాం మండలంలోని కె. సీతాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం(Fire accident)లో పాపమ్మ అనే వృద్ధురాలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం పది పూరిళ్లు పూర్తిగా దగ్ధమై గ్రామాన్ని విషాదంలో ముంచాయి.
Read Also: Bapatla Crime: పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో, ముగ్గురు మృతి

వృద్ధురాలి సజీవ దహనం
చలి తీవ్రంగా ఉండటంతో పాపమ్మ తన నివాసమైన గుడిసెలో కుంపటి వెలిగించుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో కుంపటి నుంచి వచ్చిన నిప్పురవ్వలు సమీపంలో ఉన్న గడ్డిపై పడటంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పూరి గుడిసె కావడంతో మంటలు వేగంగా వ్యాపించి పక్కపక్కనే ఉన్న మరికొన్ని గుడిసెలను కూడా క్షణాల్లో ఆవరించాయి. ఫలితంగా మొత్తం తొమ్మిది గుడిసెలు అదనంగా అగ్నికి ఆహుతయ్యాయి.
గ్రామస్థులు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించినా మంటల తీవ్రత అధికంగా ఉండటంతో సాధ్యపడలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(Firefighters) ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే నష్టం భారీగా జరిగిపోయింది. ఈ అగ్నిప్రమాదంలో పాపమ్మ ప్రాణాలు కోల్పోగా, పది కుటుంబాలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :