విజయవాడ కనకదుర్గమ్మగుడిలో భారీగా ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి : దుర్గమ్మవారి ఆలయంలో ఈసంవత్సరం సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమయ్యే దసరా (Dussehra) ఉత్సవాలను వైభవోపే తంగా నిర్వహిస్తామని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆల యంలోని మహామండపంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ వైదిక కమిటీ సూచనల మేరకు జరిగే ఈ ఉత్సవాల్లో సెప్టెంబర్ 29న మూలానక్షత్రం (శ్రీ అమ్మవారి జన్మనక్షత్రం), అక్టోబర్ 2న విజయదశమితో కలిపి 11 రోజుల పాటు జరగబోయే దసరా ఉత్సవాలను వైభవోపేతంగా జరపడానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తామన్నారు.సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి త్వరగా దర్శనమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు.
దేవదాయ శాఖ మంత్రి, కమీషనర్, ఇతర ఉన్నతాధికారుల సలహాలు, సూచనలను పాటిస్తూ దనరా ఉత్సవాలను వైభవోపేతంగా జరువుతా మన్నారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ సెప్టెంబర్ 22న దుర్గమ్మవారు ఆశ్వయుజ పాడ్యమిన శ్రీబాలా త్రిపుర సుందరీ దేవిగా, 23వతేదీన శ్రీగాయత్రిదేవి, 24న శ్రీ అన్నపూర్ణాదేవిగా, 25న శ్రీ కాత్యాయని దేవిగా, 26న శ్రీమహాలక్ష్మి దేవిగా, 27న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 28న 3 మమాచండీ దేవిగా, 295 మూలానక్షత్రంరోజు శ్రీ సరస్వతి దేవిగా, 30న దుర్గాష్టమి రోజున దుర్గాదేవిగా, అక్టోబర్ 1న నవమి తిథినాడు శ్రీ మహిషాసుర మర్దని దేవిగా, అక్టోబర్ 2న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మవారు భక్తులను అనుగ్రహిస్తా మన్నారు.
అలాగే ప్రతిరోజూ సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్ల నగరోత్సవం, ఏటా మాదిరిగా అర్చక, వేద సభలు నిర్వహిస్తామని, సెప్టెంబర్ 29న శ్రీసరస్వతి మాతగా అనుగ్రహించే దుర్గ మ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. అక్టోబర్ 2న విజయదశమి నాడు పవిత్ర కృష్ణానదిలో శ్రీ స్వామి అమ్మవార్లు తెప్పోత్సవంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహి స్తారన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు లింగంబొట్ల దుర్గాప్రసాద్, చింతపల్లి ఆంజనేయ ఘనాపాఠి, విఎస్ మహర్షి ఘనా పాఠి, వేదపండితులు, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు శ్రీధర్ శర్మ, (Sridhar Sharma) ఆలయ ఇఇలు, ఎఇఓలు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

దుర్గమ్మవారి సేవలో విజయవాడ రైల్వే డిఆర్ఎం:
దుర్గమ్మ వారిని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన మోహిత్ సాంకియా సోమవారం దర్శించు కు న్నారు. ఆయనకు ఇఓ వికె శీనానాయక్ దుర్గమ్మ వారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందిం చారు. వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు.
దుర్గమ్మ ఆలయానికి భక్తుల విరాళం: దుర్గమ్మ
ఆలయంలో జరిగే అభివృద్ధి పనులకు హైదరా బాద్కు చెందిన శ్రీ షిరిడి సాయి కన్స్ట్రక్షన్స్ పేరిట ఎండి ఎస్ శ్రీనివాస్, భార్య వసంత, కూతురు సహన ఇతర కుటుంబీకులతో కలిసి రు. 2లక్షల చెక్కును ఇఓ వికె శీనా నాయక్కు అందించారు.
అలాగే మచిలీపట్నంకు చెందిన శ్రీసర్వలలిత, తమ కుటుంబీకులతో కలిసి రు. 2లక్షలు ఆలయాభివృద్ధి పనులకు, రు.2 లక్షలు నిత్యాన్నదాన పథకానికి విరాళంగా సోమ వారం ఇఓకు అందించారు. అదేవిధంగా విజయ వాడకు చెందిన అట్లూరు రామచంద్రరావు, విజయలక్ష్మి దంపతులు తమ పిల్లలు శ్రీరాం సుహాస్, పూజితల పేరిట రు. 1లక్షను విరాళంగా సోమవారం అందించారు.
దాతలకు, వారి కుటుంబసభ్యులకు దుర్గమ్మవారి దర్శనం ఏర్పాటు చేసిన అధికారులు, దుర్గమ్మవారి ప్రసా దం, శేషవస్త్రం, మెమొంటోలు అందించారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Reconstruction : ఎపి పునర్నిర్మాణం దిశగా ‘పి-4’