రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తు, నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు బలి అవుతున్నాయి. ట్రాఫిక్ శాఖ(Traffic Department) కఠినమైన నియమాలు అమలు చేస్తున్నప్పటికీ, కొంతమంది వాటిని లెక్కచేయకపోవడం వల్ల ప్రాణాంతక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా నెల్లూరులో జరిగిన ప్రమాదం ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చూపించింది. సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఒక కారును ఢీకొట్టింది. రాంగ్ రూట్ లో వచ్చిన లారీ ఢీకొట్టడంతో కారు కొంతదూరం వరకు ఈడ్చుకుపోయింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి(Spot dead) చెందారు. కారు పూర్తిగా టిప్పర్ కింద ఇరుక్కుపోయి, నుజ్జు నుజ్జుగా మారింది. మృతులలో ఒక చిన్నారి కూడా ఉండటం విషాదాన్ని మరింత పెంచింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీశారు. మృతుల వివరాలను సేకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రమాదం ఎక్కడ జరిగింది?
నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి కారణం ఏమిటి?
రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ కారు ఢీకొనడం వల్ల జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: