పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)జరిగింది. బొలెరో ట్రాలీ వాహనం మరియు కొబ్బరికాయల లారీ ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో నలుగురు వ్యక్తులు మృతి (Four people died) చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బొలెరోలో కూలీలు ప్రయాణిస్తూ పంట కోత పనుల కోసం వెళ్తున్నారు.
మృతుల వివరాలు
మృతులు పగడాల రమణారెడ్డి (45), ఆయన భార్య సుబ్బమ్మ (40), జొన్నగిరి రామాంజి (36), ఆయన భార్య అంకమ్మ (28)లుగా గుర్తించారు. సుబ్బమ్మ, అంకమ్మ ఘటన స్థలంలోనే మృతి చెందగా, రమణారెడ్డి మరియు రామాంజి వినుకొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. క్షతగాత్రులైన కన్నెబోయిన నాగమణి, పగడాల శివమ్మ మరియు డ్రైవర్ కదిరి నాగేశ్వరరావును స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంత్రి నారా లోకేశ్ స్పందన
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రులు స్పందించారు. మంత్రి నారా లోకేశ్ వెంటనే అధికారులను అప్రమత్తం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే పల్నాడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మృతుల కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదం తీవ్రత దృష్ట్యా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.
Read Also : Guntakal : TDP ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్