గన్నవరం(కృష్ణా) : రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య భీమా సేవల వైద్య భీమా సేవల శాఖ మంత్రి, కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Subhash) తెలిపారు. కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం అన్నదాత సుఖీభవ, పియం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సుభాష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పధకం కింద రాష్ట్రప్రభుత్వ వాటాగా ఏడాదికి రూ.14వేలు, పియం. కిసాన్ కేంద్రప్రభుత్వ వాటా రూ.6 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు చొప్పున రైతులకు ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అగష్టులో మొదటి విడతగా అగష్టులో రూ.7 వేలు, రెండవ విడతగా ఇప్పుడు రూ.7వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు.
Read Also: YSRCP: విశాఖ ఉక్కు పై వైఎస్సార్సీ ఫేక్ ప్రచారం: మంత్రి సుభాష్

రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,343 కోట్లను జమ చేయగా, కృష్ణాజిల్లాలో 1,33,856 మంది రైతులకు రూ.88.49 కోట్లు ఇస్తున్నట్లు వివరించారు. గన్నవరం నియోజకవర్గంలో 24,921 మంది రైతులకు రూ.16.05 కోట్లు అందించినట్లు మంత్రి వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి రెండవరోజునే ధాన్యం డబ్బులు చెల్లిసున్నట్లు ఆయన తెలిపారు. టార్పాలిన్లు, స్పేయర్లను రైతులకు పంపిణీ ఎమ్మెల్యే వెంకట్రావ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం(Government) వ్యవస్థలను భ్రష్టు పట్టించి, రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేయగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవస్థలను గాడిలో పెడుతూ అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తుందన్నారు.
వీరవల్లి గ్రామ పిఏసిఎస్ ఆవరణలో ధాన్యం
కృష్ణా జిల్లాలో రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటల స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. అనంతరం తానా అందించిన వీరవల్లి గ్రామ పిఏసిఎస్ ఆవరణలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్, జిల్లాకలెక్టర్ బాలాజీ ప్రారంబించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్ళు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఏయంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, బిజేపీ కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమార స్వామి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: