విజయవాడ : పీఎం కిసాన్ అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2వ తేదీన అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సిద్ధమైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ స్కీం ను ప్రారంభిస్తారు. రాష్ట్రం లోని 46 లక్షల 85వేల 838 మంది రైతులు ఈ స్కీమ్గ్వారా లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో రాష్ట్రవాటాగా ఒక్కో రైతుకు రూ. 5,000చొప్పున మొత్తం 2,342.92కోట్ల రూపాయలు రైతులఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమచేయనుంది. అర్హులైన రైతులం దరికీ అన్నదాతా సుఖీభవ అందాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో ఆగస్టు 2వ తేదీన గ్రామ సచివాలయం నుంచి పంచా య తీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేం ద్రాలస్థాయిలో కార్యక్రమం పండుగ వాతావరణం ఉండనుంది. అన్నదాతా సుఖీభవ అందుకునే రైతులు సెల్ఫోన్లకు ఒకరోజు ముందే మన మిత్రద్వారా సందేశాలు వస్తాయి. ఇప్పటికే రైతుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుంది. వెబ్ల్యండ్లో రైతు ఆధార్ నంబర్ తప్పుగా ఉంటే రెవెన్యూ అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలి.
జాబితాలో రైతుపేరు లేకపోయినట్లయితే వ్యవ సాయ కేంద్రాల్లో సహాయకులను సంప్రదిం చాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని 46 లక్షల 85వేల 838 మంది రైతులు పీఎం కిసాన్అన్నదాతా సుఖీభవ పథకాన్ని ద్వారా లబ్ధిపొందనున్నారు.

ఒక్కో రైతు అకౌంట్లో రూ.7,000జమ, దీనికితోడుగా కేంద్ర ప్రభుత్వం పీఎంకిసాన్ పథకంకింద మొదటి విడతగా రూ.2,000 చొప్పున 831.51 కోట్ల రూపాయలను రైతులకు సాయంగా అందించనుంది. అంటే ఆగస్టు 2వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్లో రూ.7,000 జమ చేస్తాయి. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో కలిపి ఏడాదికి రూ.20,000 అందిస్తామని కూటమి ఎన్నికల వేళ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
పీఎం కిసాన్ పథకంలో ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6,000 సాయానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ కింద మరో రూ.14,000 కలిపి అందజేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి రెండు విడతల్లో రూ.5,000 చొప్పున, మూడో విడతలో రూ.4,000 ఇవ్వనుంది. అన్నదాతా సుఖీభవకు సంబంధించి 59,750 వినతులు నమోదు కాగా 58,464 అప్లికేషన్ లను పరిష్కరించారు. ఈ పథకంపై సందేహాల నివృత్తికి ప్రభుత్వం 155251 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో తీసుకొచ్చింది.
READ MORE :