हिन्दी | Epaper
నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Fake Liquor: మాజీ మంత్రి జోగి ఖాతాల్లోకి భారీగా నగదు మళ్లింపు!

Tejaswini Y
Fake Liquor: మాజీ మంత్రి జోగి ఖాతాల్లోకి భారీగా నగదు మళ్లింపు!

నకిలీ మద్యం కేసులో సిట్ నిర్ధారణ

విజయవాడ : నకిలీ మద్యం(Fake Liquor) తయారీ కేసులో సిట్ మరో అనుబంధ చార్జీషీట్ను విజయవాడ న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఈ చార్జీసీట్లో స్కామ్లో అత్యధిక భాగం నిధులు మాజీ మంత్రి జోగి రమేష్ దక్కినట్లు స్పష్టం చేసింది. నకిలీ మద్యం కేసులో మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో 23 మంది అరెస్టయ్యారు. తాజాగా వేసిన చార్జీషీట్తో కలిపితే మొత్తం 24 మందిపై అభియోగాలు మోపారు. ఈ ముఠాకు సీసాలు, మూతలు సరఫరా చేసిన మనోజ్ ను అరెస్టు చేయకపోయినా అతని పాత్రపై అభియోగపత్రం వేశారు.

Read also: Vijayawada Book Festival : నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ

జోగి ఖాతాల్లోకి భారీగా నగదు

జోగి రమేష్ కు ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం తయారీ కేసుల్లో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు నుంచి విడతల వారీగా రూ.1.18 కోట్లు ముట్టిందని సిట్ తేల్చింది. అందులో రూ.45.06 లక్షలను జోగి రమేష్ ఆదేశాల మేరకు ఆయన సోదరుడు జోగి రాముకు నేరుగా అందజేయగా, మరో రూ.72.90 లక్షలను స్వర్ణ డెవలపర్స్ (జోగి రమేష్ సొంత సంస్థ) బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు గుర్తించింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి జోగి రమేష్(Jogi Ramesh) వ్యక్తిగత ఖాతాలోకి భారీ మొత్తాల్లో మళ్లింపులు జరిగినట్లు నిర్ధారించింది.

Jogi Ramesh
Fake Liquor: Huge cash diversion into former minister Jogi’s accounts!

స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో డబ్బులు జమైన ప్రతి సందర్భంలోనూ అంతకు కొద్ది రోజుల ముందే ఏఎన్ఆర్ బార్ బ్యాంక్ ఖాతా నుంచి, అద్దేపల్లి జగన్మోహనరావు వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా అయ్యాయి. 2022 జూన్ 20, 28, సెప్టెంబరు 1, 2024 మార్చి 5వ తేదీల్లో ఏఎన్ఆర్ బార్ బ్యాంక్ ఖాతా నుంచి అద్దేపల్లి జనార్ధనరావు రూ.42.20 లక్షలు విత్ డ్రా చేశారు. 2022 సెప్టెంబరు 5, 13, 15, 21, 2024 మే 28 తేదీల్లో స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో రూ.46 లక్షలు జమయ్యాయి.
2022 9, 20, 21, 2023 మార్చి 14, 21 తేదీల్లో అద్దేపల్లి జగన్మోహన్రావు రూ.24 లక్షలు విత్ర చేశారు. 2022 మార్చి 9, సెప్టెంబరు 21, 23 తేదీల్లో స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో రూ.26.90 లక్షలు జమయ్యాయి.

మాజీ సీఎం జగన్ హయాంలో జోగి రమేష్ నేతృత్వంలో, ఆయన అండదండలతో అద్దేపల్లి జనార్ధనరావు ఇబ్రహీంపట్నం పాత ఏఎన్ఆర్ బార్ ప్రాంగణంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నడిపించారని, హైదరాబాద్ నుంచి ఏపీలోకి సుంకం చెల్లించని మద్యం తీసుకొచ్చి ఇక్కడ బార్లలో విక్రయించేవారని గుర్తించింది. అందుకు ప్రతిఫలంగానే ఎప్పటికప్పుడు రమేషు సొమ్ములు ముట్టజెప్పేవారని వెల్లడించింది. ఆయా బ్యాంకు లావాదేవీల వివరాలు, మనీ ట్రయల్, కాల్ డేటా: రికార్డులు, టవర్ లొకేషన్లు, శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో సిట్ ఈ గుట్టు రట్టు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు చార్జీషీటు దాఖలు చేశారు. జోగి రమేష్ (ఏ18), ఆయన సోదరుడు జోగి రాము (ఏ19) సహా మొత్తం 13 మందిపై అభియోగాలు మోపారు.

రూ.18.68 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు వెలగపూడి ఎస్బీఐ బ్రాంచ్లో(Velagapudi SBI branch) జోగి రమేష్ బ్యాంక్ ఖాతాలో 2019 ఆగస్టు 21 నుంచి 2025 అక్టోబరు వరకూ మొత్తం 33 లావాదేవీల ద్వారా రూ.18.68 కోట్లు జమయ్యాయి. ఇవన్నీ అనుమానాస్పద లావాదేవీలే. స్వర్ణ డెవలపర్స్ ఖాతాలోకి చెట్లు, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా 2021 నవంబరు నుంచి 2025 నవంబరు మధ్య రూ.5.61 కోట్లు జమయ్యాయి.

ఇవీ అసాధారణంగానే ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంకులోని రమేష్కు సంబం ధించిన మరో ఖాతాలో రూ.3.81 కోట్లు జమయ్యాయి. స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి పోరంకిలోని కరూర్ వైశ్య బ్యాంక్ బ్రాంచ్లో జోగి రమేష్ పేరిట ఉన్న ఖాతాలోకి 2024 మే 1 నుంచి మే 9 మధ్య రూ.25 లక్షలు జమయ్యాయి. ఇదే ఖాతాలోకి మరో రూ.15 లక్షలు జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఖాతా నుంచి జమయ్యాయి. ఎన్నికలకు ముందు ఈ డబ్బంతా వెళ్లింది. జోగి రమేష్ బాబాయ్ పేరిట పటమట బ్రాంచ్ లో ఉన్న మరో బ్యాంక్ ఖాతాలోకి స్వర్ణ డెవలపర్స్ ఖాతానుంచి రూ.52.60 లక్షలు జమయ్యాయి.

జోగి రమేష్, జోగి రాము జనార్ధనరావు, అద్దేపల్లి జగన్మోహన్రావుతో వాట్సప్ కాల్, ఇతర రహస్య మార్గాల ద్వారా మాట్లాడుకునేవారు. జనార్ధనరావు (ఏ1) 2023 నవంబరు 28 నుంచి 2025 నవంబరు 1 మధ్య జోగి రాముతో 18సార్లు కాంటాక్ట్ ఉన్నట్లు కాల్ డేటా, టవర్ లొకేషన్ డేటా అనాలిసిస్లో తేలింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870