నకిలీ మద్యం(Fake Liquor Case) వ్యవహారంపై సిట్, ఎక్సైజ్ అధికారులు ఈ వారంలో ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలుకు సన్నద్దమవుతుంది, ఈ వారంలోనే చార్జీషీట్ను(Chargesheet) కోర్టులో దాఖలు చేసేందుకు అవసరమైన ముందస్తు రంగాన్ని సిద్ధం చేసుకుంటుంది. చట్ట ప్రకారం పదేళ్లలోపు శిక్ష పడే కేసులకు 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ను కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంది. దీంతో డిసెంబరు 6వ తేదీలోగా అభియోగపత్రం దాఖలు చేయాలన్న ఆలోచనలో ఎక్సైజ్ అధికారులు ఉన్నారు.
Read also: Cases of Scrub Typhus : ఏపీ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిగ్గర్ అనే పురుగు

ఎక్సైజ్ కోర్టులో అభియోగపత్రం
ములకలచెరువు కేసులో ఉన్న పలువురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉంది. ఇంకా కొందరు అరెస్టు కావాల్సి ఉంది. తొలుత ప్రాథమిక ఛార్జిషీట్ వేసి, ఆ తర్వాత అనుబంధ పత్రాలు దాఖలు చేయాలని తలపోస్తున్నారు. అక్టోబరు 6న భవానీపురం ఎక్సైజ్ స్టేషన్లో నమోదైన కేసు(Fake Liquor Case)లో ఇప్పటివరకు సాగిన దర్యాప్తు ఆధారంగా ఎక్సైజ్ కోర్టులో అభియోగపత్రం వేయనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చారు.
మూతలు సరఫరా చేసిన మనోజ్కుమార్, ధారబోయిన ప్రసాద్, సీసాలు సమకూర్చిన సెంథిల్ తదితరులు అరెస్టు కావాల్సి ఉంది. ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులు తమ ఫోన్లలో చెరిపేసిన ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి రాబట్టారు. నిందితుల మధ్య సాగిన యూపీఐ చెల్లింపులు, వాటి తాలూకూ స్క్రీన్షాట్లు, పలు ఫొటోలు బయటపడ్డాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: