పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
కళ్యాణదుర్గం(Anantapur District): కళ్యాణదుర్గం (Kalyanadurg) లో వెలుగుచూసిన నకిలీ ఈ స్టాంపుల (Fake Stamps) వ్యవహారంపై తీగ లాగితే డొంక కదులుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్టాంపులు కుంభకోణం రాజకీయ దుమారం లేపటంతో పాటు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును నమోదు చేసుకున్న అనంతపురం 2 టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు (Amilineni Surendrababu) కుటుంబానికి చెందిన ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీసేవ నిర్వాహకుడు ఎర్రప్ప అలియాస్ బాబు (Errappa alias Babu) తోపాటు అతని భార్య భార్గవి (Bhargavi), మోహన్ (Mohan) అనంతపురం 2వ పట్టణ పోలీస్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని తొలుత అనంతపురం (Anantapur) డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. గురువారం కేసును కళ్యాణదుర్గం (Kalyanadurg) పట్టణ పోలీస్ స్టేషన్ బదిలీ చేసి నిందితులను అక్కడికి తరలించారు. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం పోలీసులు ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేశారు. ఎర్రప్ప 2020 నుంచి ఇప్పటివరకు 13 వేలకు పైగా ఈ స్టాంప్లు జారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రప్ప, అతని భార్య భార్గవి, మోహన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్యాంకు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. గతంలో మీసేవలో పనిచేసిన వ్యక్తుల వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కంబదూరు (Kambadur) మండలానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఎర్రప్ప చేస్తున్న నకిలీ ఈస్టాంపుల వ్యవహారాన్ని తొలుత స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. ఎర్రప్ప జారీ చేసిన ఈస్టాంపులు, ప్రభుత్వానికి జమైన నగదును పోల్చి చూడగా తేడాలు ఉన్నట్లు తేలడంతో విచారణ చేపట్టారు. నకిలీ ఈ స్టాంప్ (Fake Stamps) కుంభకోణం పై రాష్ట్ర రెవిన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల మంత్రి అనగానీ సత్య ప్రసాద్ స్పందించారు. పోలీసుల అదుపులో ఉన్న ఈ స్టాంపుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున ఎర్రెప్ప అలియాస్ మీసేవబాబును శని, ఆదివారాలలో పోలీసులు అధికారికంగా అరెస్టు చూపించి కేసువివరాలను వెల్లడించే అవకాశం ఉంది. స్టాంప్ ల టాంపరింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు హెచ్చరించారు. కళ్యాణదుర్గం నకిలీ ఈ స్టాంపుల అవినీతిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది
Read also: Farmer: దిక్కుతోచని తోతాపురి రైతు