Heavy rain likely in Andhra : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మురసు తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించింది. గత ఆరు గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతున్నట్లు తెలిపింది. తాజా వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ తుఫాన్ నేడు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా నెల్లూరు నుంచి నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశాలున్నట్లు పేర్కొంది. తుఫాన్ కదలికలు, తీవ్రతను వాతావరణ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Read Also : ముగిసిన మున్సిపల్ పోలింగ్

కోస్తా, రాయలసీమ జిల్లాలకు అతిభారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని SDMA హెచ్చరించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలు, నీరు ప్రవహించే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంతాల్లోని ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలకు సిద్ధమవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :