ఆడుదాం ఆంధ్ర పై విచారణ పూర్తి రేపో, మాపో డిజిపికి నివేదిక
విజయవాడ : వైఎస్సార్సీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తియ్యింది. ఈ నివేదికను ఒకటి రెండు రోజుల్లో డిజిపికి అందచేయనున్నట్లు విజిలెన్స్ విభాగం అధికారుల వర్గాల సమాచారం.. వైఎస్సార్సీ హయాంలో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలను టిడిపి. బిజెపి, జనసేన వర్గాలు చేస్తున్నాయి. క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీ నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కె రోజా (Ex Minister Roja) పాత్ర ఉందని టిడిపి నేతలు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది’. ‘ఆడుదాం ఆంధ్రా’లో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలను విజిలెన్స్ విభాగం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక లోని అంశాల ఆధారంగా భాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వైఎస్సార్సీ పరిపాలనసాగించిన చివరిఏడాదిలో ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడలను నిర్వహించి… అందులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు టిడిపి నేతలు ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే దీనిపై విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమం పేరుతో స్పోర్ట్స్ కిట్లు, యాప్, టీ షర్టులు, బ్రోచర్లు, క్రీడల నిర్వహణ, రవాణా, ఫుడ్ అండ్ ప్రైజ్ మనీ, ముగింపు రోజు ఏర్పాట్లు… ఇలా మొత్తం (Rs. 119 crores spent) చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అప్పటి మంత్రి రోజా, నాటి శాప్ చైర్మన్ సిథార్ధరెడ్డి చెప్పిన వారికి వర్కర్ ఆర్డర్లు, నచ్చిన వారికి ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా భారీగా వెనకేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఆడుదాం ఆంధ్రాలో చేసిన అవినీతిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని.. ఆగస్టు 10 తర్వాత మాజీ మహిళా మంత్రి ఏ క్షణంలోనైనా అరెస్ట్ కావచ్చన్నారు. శాప్ చైర్మన్ రవినాయుడు ఆంధ్రాలో జరిగిన స్కాంపై… నేడో… రేపో విజిలెన్స్ విభాగం అధఙ్ఞకారులు డిజిపికి నివేదిక సమర్పించనున్నారు. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం మూలాలను వెలికి తీసినట్లు సమాచారం. నివేదికలో అంశాలఆధారంగా ప్రభుత్వం.. భాధ్యులపై చర్యలు తీసుకోనుంది. రూ.19 కోట్లతో వైఎస్సార్సీ ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా దోచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేసింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :