ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించారు. ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. అయితే దేవుని దయ, పార్టీ కార్యకర్తల ఆశీర్వాదాలతో తాను పూర్తిగా కోలుకున్నానని స్పష్టం చేశారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఆందోళన అవసరం లేదు
ఇంటర్నెట్‌లో వచ్చిన కొన్ని వార్తలు అనవసర ఆందోళనకు కారణమయ్యాయని బొత్స అన్నారు. తన ఆరోగ్యంపై వస్తున్న సందేహాలను నివృత్తి చేస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నానని, సాధారణ అస్వస్థత మాత్రమే అనిపించిందని వివరించారు. వైద్య సలహాతో తక్షణమే విశ్రాంతి తీసుకున్నానని, ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పారు.
‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి వచ్చిన వారికీ కృతజ్ఞతలు
‘వెన్నుపోటు దినం‘ (Vennupotu Dinam ) సభలో భారీగా హాజరైన కార్యకర్తలకు బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు, అభిమానులు తన ఆరోగ్యం గురించి చూపిన ప్రేమకు, శ్రద్ధకు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే తిరిగి ప్రజల మధ్య ఉండబోతున్నానని తెలిపారు.
Read Also : Monkeys :కోతులపైకి గొడ్డలి విసిరిన తండ్రి..బలైన కుమారుడు