ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC)లో PSLV-C62 రాకెట్ ప్రయోగానికి ఇస్రో తుది ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రయోగం ద్వారా EOS-N1 Satellite భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా రోదసిలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Read Also: Karnataka: బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

వ్యవసాయ అవసరాలు, భూ పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ వంటి కీలక రంగాల్లో సమాచారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. EOS-N1 Satellite ద్వారా పంటల అంచనా, ప్రకృతి వనరుల నిర్వహణ, విపత్తుల పర్యవేక్షణకు మరింత సహకారం అందనుంది.
ఈ ప్రధాన ఉపగ్రహంతో పాటు, ఒక విశ్వవిద్యాలయం రూపొందించిన శాటిలైట్‌తో పాటు అమెరికాకు చెందిన ఒక చిన్న ఉపగ్రహాన్ని కూడా ఇదే రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. బహుళ ఉపగ్రహాల ప్రయోగంలో ఇస్రో తన సాంకేతిక నైపుణ్యాన్ని మరోసారి చాటనుంది. ఇటీవల ఇస్రో చేపట్టిన బ్లూబర్డ్ ప్రయోగం విజయవంతం కావడం నేపథ్యంలో, PSLV-C62 మిషన్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: