కళ్ళెదుట మానవాళి తట్టుకోలేనంతగా పర్యా వరణ విధ్వంసం జరుగుతుంటే అగ్రదేశాలు కళ్ళప్పగించి చూస్తున్నాయే తప్ప తమవంతు ప్రయత్నమేదీ చేయటానికి ముందుకు రావడం లేదు. అదే ప్రపంచ దేశాలకు శాపంగా మారింది. కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం పదేళ్ల క్రితం ప్యారిస్ వేదికగా కుదిరిన చరిత్రాత్మక ఒప్పందాన్ని దాదాపు అన్ని దేశాలూ పోటీలు పడి మరీ ఉల్లంఘిస్తున్న విష యం విదితమే! ఈ తరుణంలో బ్రెజిల్లోని బెలేమ్ నగరంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్30) సదస్సు, అంతకు ముందు శ్రీలంకలోని బాకులో కూడా పర్యావరణ (Environment) సదస్సులు జరిగాయి. నానాటికీ తీసికట్టు నాగంభ ట్లు అన్న చందాన ప్రతి సదస్సులోనూ చర్విత చర్వణం గా పాత లక్ష్యాలకు కొత్త అర్థాలు, భాష్యాలు వెదుక్కోవ డమే సరిపోతోంది. ఏటా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ సదస్సులు జరగడం, చర్చోపచర్చలతో ముగియడం రివాజు. అందువల్లే నిరుడు అజర్ బైజాన్లోని బాకూలో కాప్ 29 కాస్తంత పర్వాలేదనిపిం చింది. ఆ తర్వాత ఎన్నో దేశాల ముఖ్యప్రతినిధులు హాజరౌతూనే ఉన్నా చెప్పుకోదగిన ఫలితాలు లేవనే చెప్పాలి. దక్షిణ అమెరికా ప్రాంత దేశాన్ని ఎంపిక చేసుకోవటంలో ఓ ప్రత్యేకత కనపడుతోంది. అమెజాన్ అడవుల
సమీపంలో ఉన్న బెలేమ్ పోర్ట్ ప్రదేశం వాతావరణ మార్పులపై ఇక్కడ చర్చించడమే మంచిదనే అభిప్రాయంఏర్పడింది. సుస్థిరాభివృద్ధికి మద్దతుగా ఉండాల్సిన అవశ్యకత కొన్ని దేశాలకు తెలియవ స్తుందన్నది ఈ నిర్ణయ నేపథ్యం. ప్రపంచం ఇప్పుడు ప్రమాదకర వాతావరణంలోకి ప్రవేశించింది. పారిశ్రామికీ కరణకు ముందు, తర్వాత అని లెక్కిస్తే ఆనాటి ఉష్ణోగ్ర తలు వేరు ఇప్పటి ఉష్ణోగ్రతలు వేరు. ఎ2 డిగ్రీల సెల్సియస్లోపే పెరుగుదల అనుకూల వాతావరణంగా ఉండాలి లేదా కనీసం అది 1.5 డిగ్రీల సెల్సియసు పరిమిత మయ్యేలా చూడాలని ప్యారిస్ ఒడంబడికలో ప్రధాన నిర్ణయం. కానీ 2024నాటికి 1.5డిగ్రీల పరిమితి దాటిపో యామన్నది అక్షరాల నిజం. ముంచుకొస్తున్న పర్యావరణ విపత్తులను ఏవిధంగానూ ఆపలేమని తేటతెల్లమైంది. గత బైడెన్ ప్యారిస్ ఒడంబ డిక నుండి బయటికి రాగా ఇప్పుడు ట్రంప్ దానిని ధ్రువీ కరించారు.అంతేతప్ప అమెరికా నుంచి అనుకున్నంత నిధులు కూడా రాలేదు. దాంతో నిర్భాగ్య దేశాలకి ఒరి గిందేమీ లేదు. గతానికి భిన్నంగా కాకుండా కొనసాగిం పుగానే అమెరికా వ్యవహారం నడుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు గ్రీన్ క్లైమేట్ ఫండ్ కు ఇస్తామన్న ఆర్థిక సహా యం పెంచే విషయంలో ఆయా అగ్రదేశాలు కిమ్మన్నాస్తి గా ఉండిపోయాయి. అగ్రరాజ్యాలు ఇలా బాధ్యతల నుంచి తప్పుకోవడం, పర్యావరణ విధ్వంసంతో తమకేమిటన్నట్లు పలాయన వాదం చిత్తగించడం సబబుగా లేదు. రవాణా నౌకలకాలు ప్యాన్ని అరికట్టేందుకు 100 దేశాల మధ్య ఒడంబడికపై సంతకాలు చేయాల్సిన సందర్భంలో అమెరికా సైంధవపాత్ర పోషించిందని వేరే చెప్పనక్కర్లేదు. కాప్ 31 సదస్సులో వివిధ దేశాల అభిమతాలు ఎలాఉంటాయో చెప్పలేం. గమ్యాన్ని చేరుకోవడం తప్పదు. కానీ బడుగు దేశాలు ఎన్ని అగచాట్లుపడాలో ఊహించడం కష్టం. నిధులు, ప్రత్యామ్నాయ వనరులు లేకుండా గమ్యం ఎలాగో తదు పరి సదస్సు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమెరికాలో శిలాజ ఇంధన వాతావరణమార్పులపై ఆశించినంత మార్పులేమీ జరుగలేదు. వాతావరణ ఆధారిత ప్రాజెక్టులకు అనుమతులిస్తున్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపూ లేదు. పైగా ఆఫ్రికా తీరసమీపంలోని వేడినీటి పగడపుదిబ్బలు కనుమరుగుకావటం ప్రమాద సంకేతమని బ్రిటన్ విశ్వవిద్యాలయం ఒకటి విశ్లేషించింది. హెచ్చరిం చింది కూడా. కనీసం కాప్ 31లోనైనా భూగోళం పది కాలాలు పచ్చగా ఉంచే నిర్ణయాలు తీసుకోగలరని ఆశిద్దాం. లేకుంటే పర్యావరణ (Environment) సమస్యను ఎదుర్కో వడానికి సిద్ధం కావాల్సిందే! ఐక్యరాజ్యసమితి సదస్సులు సాధించాయని చెప్పుకోవ డానికి ఏమీలేదు. అమెరికాతో సంబంధంఉన్న సదస్సుల పర్యావసానం అలాగే ఉంటుందని తెలియంది కాదు. నిర్ణయాత్మకంగా వ్యవహరించలేని సదస్సులు చివ రాఖరికి నిరర్ధకంగా మిగులుతాయి. 2015నాటి ప్యారిస్ ఒడంబడికలో అంగీకరించిన లక్ష్యాలను ఏదేశం ఏమేరకు నెరవేర్చిందో చూసి, ఆ విషయంలో చేయాల్సిందేమిటో నిర్దేశించటమే ఉద్దేశం. బెల్లేమ్ ఈసారి అన్నిదేశాలనుంచీ ఆ లక్ష్యాల సాధనకు అవలంబించబోయే కార్యా చరణేమి టో తెలుసుకోవటమే ధ్యేయమన్నట్లు భావించినా తీరా సాధించింది స్వల్పమే. పాశ్చాత్య దేశాల పాత్ర అంతంత మాత్రమే. శిలాజ ఇంధనాల వినియోగాన్ని అంచెలంచెలు గా తగ్గించటానికి ఉద్దేశించిన కాప్సదస్సు ఏమీ చెప్పలేక పోయింది. కాప్ 29,30ల మధ్య చెప్పుకోదగిన ప్రగతి ఏమీకన్పించడం లేదు. భూగోళం వేడెక్కడానికి దారితీసే కారణాల్లో ప్రధానమైన శిలాజ ఇంధన వాడకంపైనే ఏమీ సాధించలేని స్థితిలో ఐక్యరాజ్యసమితి పరిధివెలుపలవాటి తగ్గింపు కృషి కొనసాగుతుందనీ, ఇందుకు కొలంబియా, మరో 90దేశాలూ సమష్టిగా ప్రణాళిక రచనకు పూనుకోవ చ్చు. బెలేమ్ సదస్సు గురించి చెప్పు కోదగ్గదల్లా వాతావ రణ సంక్షోభాన్ని ఎదుర్కొనే దేశాలకు చేసే ఆర్థికసాయాన్ని మూడు రెట్లు పెంచుతామనిసంపన్న దేశాలిచ్చిన హామీ అలా ఒంటిరిగా మిగిలిపోయింది. దాన్ని యధాతథంగా కొనసాగేలా చేయడమే. అదేవిధంగా జరిగితే
ఏటా 12వేల కోట్లడాలర్లు సమకూరుతాయి. కానివివిధ దేశాలు కనీసం ముప్పైవేలకోట్ల డాలర్లుంటేనే పర్యావరణ సమత్యులత సాధించవచ్చునని అంచనావేయడం కొసమెరుపు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: