हिन्दी | Epaper

AP Government: ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Sudheer
AP Government: ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ (AP Government) ఉద్యోగుల సాధారణ బదిలీలకు(Employee transfers) ప్రభుత్వం తుది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు అమలులో ఉన్న బదిలీల నిషేధాన్ని ఎత్తివేస్తూ, మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

గైడ్‌లైన్స్ ప్రకారం

ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం, ఒకే పోస్టింగులో ఐదేళ్ల సేవ పూర్తిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సిందిగా సూచనలు జారీ చేశారు. అదే విధంగా, పదోన్నతి పొందిన తర్వాత కూడా ఒకే స్థానంలో ఐదేళ్లకు పైగా పనిచేస్తున్నవారు కూడా ఈ బదిలీల పరిధిలోకి వస్తారు. ఐదేళ్లలోపు సేవ కలిగిన ఉద్యోగులకు మాత్రం వ్యక్తిగత కారణాలతో బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వనున్నారు.

ఉద్యోగులకు మినహాయింపులు, ప్రాధాన్యతలు

ఈసారి బదిలీల్లో సామాన్య నిబంధనలతో పాటు కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న ఉద్యోగులకు మినహాయింపులు, ప్రాధాన్యతలు కల్పించనున్నారు. 2026 మే 31వ తేదీలోగా రిటైర్ కాబోతున్న ఉద్యోగులకు ఈ బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అంధులైన ఉద్యోగులు, మానసిక వికాస లోపాలున్న పిల్లల తల్లిదండ్రులు, గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారు, వైద్య కారణాలున్నవారు, వితంతువులైన ఉద్యోగినులు, అలాగే భార్యాభర్తలు ఒకేచోట పనిచేయాలనుకుంటే – వీరందరికీ బదిలీల్లో ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. దీంతో ఈసారి బదిలీలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంది.

Read Also : CBI Court : గాలి జనార్దను సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870