సాంకేతిక వ్యవస్థ ప్రపంచాన్ని శాసిస్తున్న వర్తమానంలో ఇక నుంచి చదువులకు కూడాఅర్థం మారి పోయే అవకాశముంది. ఇప్పటికే చదువులకు, చేస్తున్న ఉద్యోగాలకు పొంతన లేకుండా పోయింది. ఉపా ధికి పనికి రాని చదువులెందుకనే అభిప్రాయం నేటి యువతలో ప్రబలింది. విద్యాధికుల కంటే అరకొర చదువులతో లోక జ్ఞానం సంపాదిం చుకుని, తాము చేస్తున్న వృత్తిలో నైపుణ్యం సంపాదించుకుని, సంపాదనలో ముందంజలో దూసుకుపోతున్న వారిని చూసి ఆశ్చర్యపడక తప్పదు. ఆస్తులమ్ముకుని చాలీచాలని జీతాలతో జీవితాలను భారంగా నెట్టుకొస్తున్న వారికష్టాలను చూస్తుంటే నేటి విద్యావ్యవస్థ (Education system)ను సంస్కరించవలసిన తరుణం తరుముకొచ్చిందనే భావించాలి. మానసిక వికాసాన్ని, జ్ఞానాన్ని అందించిన విద్యల సేద్యంలో సమూల మార్పులు రావాలి. నేటి విద్యార్థుల్లో చేతి వ్రాత కనుమరుగైపోతున్నది. అక్షరాలు సరిగా వ్రాయలేకపోతు న్నారు. ఉచ్చారణలో స్పష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనక్క రలేదు. సాంకేతిక పరిజ్ఞానం మానవ మేథస్సును మింగే స్తున్నది. సాంఘిక మాధ్యమాలు సంస్కారాన్ని పాతి పెడు తున్నాయి. చరవాణి పుణ్యమా అని చిన్న వయసునుండే అశ్లీల దృశ్యాలను చూసే సౌకర్యం అందుబాటు లోకి వచ్చిం ది. చదువు సంస్కారాన్ని ప్రసాదించాలి కాని దుర్గుణాలను పెంపొందించకూడదు. దురదృషవశాత్తూ నేడు జరుగుతు న్నది అదే. ఈ పరిస్థితులు మారాలి. వర్తమానంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సమాజాన్ని అధోగతి పాలు చేస్తున్నాయి. ఆధునిక మానవుడు ఆటవిక ప్రవృత్తిని సంత రించుకుని, ఆటవిక ప్రస్థానం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతున్నది.పెళ్లిళ్ళు పెటాకులైపోతున్నాయి వివాహవ్యవస్థ ఇక గతం లా మిగిలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆత్మీయబంధాలు అటకెక్కుతున్నాయి. బంధాలు,బంధుత్వాలు తెగిపోతున్నాయి. రక్తసంబంధాల మధ్య కార్చిచ్చు రగులుతున్నది. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్నట్లుగా కుటుంబ సభ్యులు పగ వారిగా మారుతున్నారు. పరాయివారు ఆత్మీయులుగా మారు తున్నారు.
Read Also : http://Supreme court: మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విష సంస్కృతి
‘ఎవరికి వారే యమునా తీరే’ అనే రీతిలో ఒకరి పొడ మరొకరికి గిట్టడంలేదు. సంస్కారం అడుగంటి, విన యం నశించి, సద్గుణాలు లోపించి సమాజం ఒక విష సంస్కృతిలోకి నెట్టబడుతున్నది. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థి తులకు మూల కారణం నేటి మన విద్యావ్యవస్థ (Education system)అని చెప్పక తప్పదు. పాఠ్యపుస్తకాలు కేవలం బట్టీ పట్టడానికి, పరీక్షల్లో మార్కులు సంపాదించడానికే ఉపకరిస్తున్నాయి. చదువులం టే కేవలం సంపాదన కోసమేనన్న దురభిప్రాయం ఏర్పడింది. నైతిక ప్రవర్తనకు సంబంధించిన అంశాలు పాఠ్యపుస్తకాల్లో లోపించడం, విలువల గురించి బోధించకుండా కేవలం మార్కుల వైపే దృష్టి సారించడం వంటి ఆధునిక వ్యాపార దృక్పథం వలన సమాజం వికృత పరివర్తన దిశగా సాగుతు న్నది. ఇప్పటికైనా మేల్కొనకపోతే మానవ ప్రపంచంలో మనిషి లక్షణాలనేవి మిగలవు. ఇప్పటికే నైతిక విలువలు అడుగంటి పోయాయి. స్వార్థం, అరాచకం, అవినీతి విచ్చలవిడి గా పెరిగిపోయాయి. పసి పిల్లలపై కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటన లు క్రూరమృగాల వేటను తలపిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలి. మంచి చెడుల విచక్షణ నేర్పించాలి. సాంకేతిక నైపుణ్యాన్ని నవసమాజ నిర్మాణానికి వినియోగించాలి. విద్య ను స్వీయ ప్రయోజనాల కోసం, పరపీడన కోసం వినియో గించడం వలన విద్యకున్న ప్రాశస్థం నశిస్తుంది. విద్యావం తుల శాతం పెరుగుతున్నా, సమాజంలో సరైన మార్పు రావడం లేదు. అరాచకాలు, హత్యలు విశృంఖలంగా కొనసా గుతున్నాయి.
నైతిక విలువలను బోధించే పాఠ్యాంశాలు
పూర్వకాలం నాటి చదువుల్లో ఉండే విలు వలు నేటి చదువుల్లో లేవు. మనిషిని మనిషిగా గౌరవించే రోజులు పోయాయి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం మంచి చెడుల గురించి చెప్పే వారు లేకపోవడమే. నేటి విద్యార్థులకు పుస్తకాలు బరువైనాయి. నేటి పుస్తకాల్లో నైతిక విలువలను బోధించే పాఠ్యాంశాలు కరువైనాయి. చదువుకు అందం సంస్కారం. వినయానికి విలువలు ఆభ రణాలు. సకల సద్గుణాలకు ఆయువు పట్టు విద్య. అలాంటి చదువులను పుస్తకాల ద్వారా విద్యార్థుల మస్తకాల్లో ప్రేరే పించాలి. విద్యావ్యవస్థలో కాలానుగుణంగా అనేకమైన మార్పులు చోటు చేసుకుంటున్న మాట వాస్తవం. రాబోయే రోజుల్లో వీటి ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. విద్యావ్యవస్థ సరిగా లేకపోవడమే సమాజం సరైన దిశలో నడవలేకపోవడానికి కారణమన్న వాదన అక్షరసత్యం. చదువు సమాజానికి ఉపయోగపడడం లేదు. స్వార్థానికి, ధనదాహా నికి, ఇతరులను అణగద్రొక్కే నైజానికి నేటి విద్య జీవం పోస్తున్నదనడంలో సందేహం లేదు. నేటి సమాజంలో విద్యావంతులు పెరుగుతున్నారు. అయినా విద్యా వంతులను గౌరవించే పరిస్థితి కూడా నేటి సంఘంలో కొరవడింది. కారణం విద్యావంతులలో కూడా సంస్కారం, వినయం కొరవడడమే. విద్యావంతుల కంటే విద్యావిహీనులే నయం అన్నభావన ఒక్కోసారి కలగకమానదు. ఇది చాలా దురదృష్ట కరం. ధనానికి దాసోహమయ్యే పరిస్థితులు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా మార్పు వచ్చి వివేకానికి, సంస్కారానికి విలువ పెరిగితేనే సమాజవికాసం ‘మూడు పువ్వులు ఆరుకాయలు’ అన్నట్టుగా వర్ధిల్లుతుంది. ఈమార్పు రావాలంటే విద్యావ్యవస్థ మెరుగుపడాలి. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన ప్రపంచమంతా వేగంగా పరుగె డుతున్నది. విదేశీ సంస్కృతి స్వదేశీ విలువలను ధ్వంసం చేస్తున్నది. ఇతర దేశాల సంస్కృతిలోని మంచిని గ్రహించి, మన దేశ సంస్కృతిని కాపాడుకోవాలి. మన చదువుల్లో విలువలకు ప్రాధాన్యత పెరగాలి. పాతకాలం నాటి నైతిక విలువలతో కూడిన విద్యతో ఆధునిక విద్యావ్యవస్థ సమ్మిళి తమై వెలుగొందాలి. “విద్యాదదాతి వినయం వినయాద్వాతి పాత్రతాం’ అన్నాడు భరృహరి. విద్య వలన వినయం, విన యం వలన పాత్రత సిద్ధిస్తుంది. అయితే నేటి విద్యావ్యవస్థ కేవలం ధనార్జనకు, ఉద్యోగ సంపాదనకే అధిక ప్రాధాన్యత నివ్వడం వలన వినయమనే విశిష్టమైన ఆభరణం సమాజ మనే కిరీటంలో చేరలేక పోతున్నది. సంస్కారం స్థానంలో కృత్రిమమైన
నటనా వైదుష్యంతో కూడిన కుసంస్కారం వ్రేళ్ళూనుతున్నది. మంచికి వంచన జరుగుతున్నది. నిజమైన సంస్కారానికి, వినయానికి చోటు మృగ్యమైపోతున్నది. స్వ కార్యాలను చక్కబెట్టుకోవడానికే చదువు ఉత్ప్రేరకంగా ఉప యోగపడుతుంది కాని సమాజ సేవకు కొరగావడం లేదు.

విలువలను చదువులతో సంస్కరించాలి
కొద్దో గొప్పో సమాజంపై అవగాహన ఉన్నవారు ఆదిలోనే హంసపాదులా నేటివ్యవస్థలో పేరుకుపోయిన అహంకార జాఢ్యమనే మనో వికారాలతో అణగద్రొక్క బడుతున్నారు. ‘చిన్నినా పొట్టకు శ్రీరామరక్ష అనుకుంటూ మనం బ్రతికితే సంఘం బ్రతికినట్టే, మనకెందుకులే అనే ధోరణి ప్రబలిపో యింది. సచ్చరిత్ర గల ఎవరూ సమాజంలో ఇమడలేక నలిగిపోతున్నారు. ఆత్మాభిమానం చంపుకోలేక, అవకాశవాదాని కి తలొగ్గడం ఇష్టంలేక మౌనముద్ర వహిస్తున్నారు. అరాచ కాలు, అత్యాచారాలు, అసాంఘిక కార్యకలాపాలు నేటి వ్యవస్థలో పెచ్చుమీరిపోతున్నాయి. ధనం, అధికారం, అహం కారం ముందు మంచితనం వీగిపోతున్నది. దిగజారిపోతు న్న విలువలు అణగారిపోతున్న మానవ సంబంధాల నేప థ్యంలో ‘త్వంశుంఠ.. త్వశుంఠ అనుకుంటూ వారినీ వీరినీ తిట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. యాంత్రికమైన చదువుల వల్ల విలువలు పడిపోతున్నాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కేవలం ఉద్యోగాలు చేసే యంత్రాలు గా కరెన్సీ నోట్లకు ప్రతిరూపాలుగాచూడడం వలనే సమా జం అధోగతి పాలైపోతున్నది. ఒకరితో ఒకరికి సంబంధాలుం డడం లేదు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేన న్న నానుడి నికమై కూర్చున్నది. మితిమీరిన ధనాపేక్ష, యుక్తాయుక్త విచక్షణ మరచిన అహంకారతత్వం కలుపు గోలుతనాన్ని, సంఘటితంగా మెసలేతత్వాన్ని మంటగల పడం బాధాకరం. అష్టవంకరలతో అడ్డదిడ్డంగా మారినసామా జికవ్యవస్థను సరిచేసే బాధ్యత ఉపాధ్యాయుల భుజస్కంధాలపైఉంది. అందుకు తగిన మార్పులను ప్రభుత్వాలు నేటి విద్యావ్యవస్థలో తీసుకురావాలి. సంస్కారాన్ని, వినయాన్ని, వివేకాన్ని, సామాజిక స్పృహను కలిగించే రీతిలో పాఠ్యాం శాలలో మార్పులు రావాలి. ‘ధనమే పరమావధి’ అనే ధోరణి మారాలి. విలువల ఆధారంగా సమాజం నడవాలంటే విద్యా వ్యవస్థపై తీవ్రమైన మేథోమధనం జరగాలి. దిగజారిపోతున్న విలువలను చదువులతో సంస్కరించాలి.
-సుంకవల్లి సత్తిరాజు
నేటి విద్యా వ్యవస్థ ఏమిటి?
నేడు, 21వ శతాబ్దంలో, చాలా పాఠశాలలు మరియు విద్యాసంస్థలు ఆధునిక విద్యను అనుసరిస్తున్నాయి, అయితే కొన్ని ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతులపై ఆధారపడతాయి. ఆధునిక విద్య విద్యార్థులకు అనేక ప్రయోజనాల కారణంగా ఆన్‌లైన్ అభ్యాసానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది.
భారతదేశంలో కొత్త విద్యా విధానం ఏమిటి?
NEP 2024 లో అత్యంత సమూలమైన మార్పు పాఠశాల విద్యా నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం ఉన్న 10+2 నిర్మాణం ఇప్పుడు 5+3+3+4 ద్వారా భర్తీ చేయబడింది. ఈ కొత్త నిర్మాణం వయస్సుకు తగినది మరియు అభివృద్ధికి అనుగుణంగా ఉంటుంది. ప్రాథమిక దశ: వయస్సు 3-8: ఈ దశలో 1 మరియు 2 తరగతుల వరకు మూడు సంవత్సరాల ప్రీ-ప్రైమరీ ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: