తూర్పు గోదావరి జిల్లా అనపర్తి (Anaparthi) ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరింది. విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి (East Godavari) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12805/12806) ఇక నుంచి అనపర్తి రైల్వే స్టేషన్‌లోనూ ఆగనుంది. ఈ రైలు హాల్టింగ్‌ను మంగళవారం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
Read also: AP: విజయం ఇచ్చే కిక్ కోసమే మనమందరం పనిచేయాలి..సీఎం

ప్రజల చిరకాల డిమాండ్ తీరడంతో స్థానికుల హర్షం
ఈ సందర్భంగా వారు రైలుకు పచ్చ జెండా ఊపి సాగనంపారు. (East Godavari) అంతకుముందు కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ర్యాలీగా రైల్వే స్టేషన్‌కు చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. అనపర్తిలో పది రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చినంత ఆనందంగా ఉందని నేతలు వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమను అడిగిన మొదటి కోరిక జన్మభూమి హాల్టింగ్ అని, దానిని గెలిచిన ఏడాదిన్నరలోనే నెరవేర్చామని తెలిపారు. ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ల సహకారంతోనే సాధ్యమైందని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ఏళ్లనాటి డిమాండ్ నెరవేరడంపై ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: