ప్రకాశం జిల్లాలోని పొదిలి పట్టణం శుక్రవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. (Earthquake) మూడు గంటల ప్రాంతంలో రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ఏం జరిగిందో అని చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. భూమి రెండు సెకన్ల పాటు కంపించిందని గుర్తించి ఎలాంటి ఆస్థినష్టం, ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: K. Vijayanand: ధాన్యం కొనుగోలులో జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్

వరుస భూకంపాలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు
ఈ ఏడాది పొదిలి పరిసర ప్రాంతాల్లో మూడు సార్లు భూకంపం (Earthquake) వచ్చిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున భూమి కంపించడంతో చాలా మంది ప్రజలు గుర్తించలేకపోయారు. అప్పటికే నిద్రలేచి దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీ బంకులు, హోటళ్లలో ఉన్నవారు భూ ప్రకంపనలను గుర్తించారు. పొదిలి పట్టణంలో వరుస భూకంపాలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: