శ్రీసత్యసాయి (SriSatyasai) జిల్లాలోనే రూ. 2,093 కోట్ల రుణాలు అందించడమే లక్ష్యం డ్వాక్రా మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగానే పరిమితం చేయకుండా, వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో కలిసి స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు భారీ రాయితీలతో కూడిన రుణాలను అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తోంది.
నేడు CRDA భవనం ప్రారంభించనున్న CM చంద్రబాబు
మహిళల కోసం పాడి ఆవులు, గేదెలు
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కోసం పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, కోళ్ల పెంపకం వంటి జీవనోపాధి యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇందుకోసం వెలుగు, పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక సభలు నిర్వహించి, ఆసక్తి ఉన్న అర్హులైన మహిళలను ఎంపిక చేస్తున్నారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ, స్త్రీనిధి వంటి పథకాల ద్వారా బ్యాంకు లింకేజీతో సులభంగా రుణాలు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు.

రూ.35వేలు, రూ.75వేల రాయితీలు
ఈ పథకాల కింద ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు మహిళలకు అదనపు బలంగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు, రూ. లక్ష విలువైన యూనిట్‌ను ఏర్పాటు చేస్తే, ప్రభుత్వం రూ. 35 వేలు రాయితీగా అందిస్తుంది. లబ్ధిదారులు మిగిలిన రూ. 65 వేలను మాత్రమే బ్యాంకు రుణం ద్వారా చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా, రెండు పాడి పశువులు, షెడ్డు నిర్మాణంతో కూడిన రూ. 2 లక్షల యూనిట్‌కు రూ. 75 వేల వరకు సబ్సిడీ లభిస్తుంది. కేవలం పాడి పరిశ్రమే కాకుండా బేకరీలు, పేపర్ ప్లేట్ల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలకు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు, వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రూ. 10 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. ఈ రుణాలన్నింటికీ లక్షకు రూ. 35 వేల చొప్పున రాయితీ వర్తిస్తుంది.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని..
ఈ కార్యక్రమం అమలుపై డీఆర్‌డీఏ పీడీ నరసయ్య మాట్లాడుతూ, లబ్ధిదారుల ఆసక్తికి అనుగుణంగా యూనిట్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక కింద 24,207 సంఘాల్లోని 1,77,040 మంది సభ్యులకు రూ. 2,093 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
సత్యసాయి బాబా జయంతి ఎప్పుడు?
సత్యసాయి బాబా (జననం రత్నాకరం సత్యనారాయణ రాజు ; 23 నవంబర్ 1926 – 24 ఏప్రిల్ 2011 ) ఒక భారతీయ దేవత , గురువు మరియు పరోపకారి.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్ని 32 మండలాలు ఉన్నాయి?
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్ని 32 మండలాలు ఉన్నాయి. అగలి, అమడగూరు, అమరాపురం, ఓబులదేవరచెరువు, కదిరి, కనగానపల్లి, కొత్తచెరువు, గాండ్లపెంట, గుడిబండ, గోరంట్ల, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, తనకల్లు, తలుపుల, తాడిమర్రి,. ఈ జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లు కూడా ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: