తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఎదురుచూస్తున్న పెద్ద సెలవు సమయం దసరా ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు శనివారం (సెప్టెంబర్ 20) నుంచి,సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. దసరా సెలవులు ప్రకటించడంతో ఫుల్ ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లతో పాటు, ప్రైవేట్ రెసిడెన్సీ స్కూల్స్‌లో ఉన్న పిల్లలు కూడా ఇంటికి వెళ్లడం ప్రారంభించారు.
తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చారు, పలు ప్రాంతాల్లో వాతావరణం గందరగోళంగా మారింది. ముఖ్యంగా నగరాల రోడ్లపై రద్దీ, బస్టాండ్లలో పిల్లల సందడి, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. ప్రతి ఏడాదీ దసరా సెలవులు (Dussehra Holidays) విద్యార్థులకు మాత్రమే కాదు, కుటుంబ సభ్యులకూ ఆనందాన్ని ఇస్తాయి.బస్టాండుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పిల్లల్ని, లగేజ్ తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు.

దసరా సెలవుల్లో మార్పులు చేసి
బస్సులు బస్టాండ్‌కు వచ్చీరాగానే ప్రయాణికులతో నిండిపోతున్నాయి. కాగా ఏపీ, తెలంగాణల్లో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తిరిగి అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు తెరచుకోనున్నాయి. నిజానికి 2025-26 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏపీ (AP) లో అక్టోబర్ 24 నుంచి అక్టోబరు 2 వరకు మొత్తం 9 రోజులు దసరా సెలవులు ప్రకటించారు. అయితే తెలంగాణ (Telangana) లో సెప్టెంబర్ 22 నుంచి దసరా సెలవులు ప్రకటించారు.గతంలో ఏపీలోనూ దసరా పండుగకు 11 రోజులు సెలవులు ఇచ్చేవారు.
మరోవైపు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయులు కూడా సెప్టెంబర్ 22నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తి చేయడంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ (Education Minister Lokesh) దసరా సెలవుల్లో మార్పులు చేసి, వాటిని పొడిగించారు. ఈ మేరకు సెలవులు ప్రకటిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక క్రిస్టియన్ మైనార్టీ స్కూళ్లకు యథావిధిగానే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 2 వరకు సెలవులు ప్రకటించింది. ఇక రెండు రాష్ట్రాల్లోనూ సెప్టెంబర్ 3న తిరిగి పాఠశాలలు తెరచుకోనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: