ఇంద్రకీలాద్రి Dussehra : దుర్గమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల (Dussehra celebrations) ఏర్పాట్లు సెప్టెంబర్ 15కల్లా పూర్తి చేయాలని ఇఓ వికె శీనా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల వివరాల పురోగతిని తెలుసుకున్నారు. కమీషనర్ ఆదేశాల మేరకు నూతన లడ్డూపోటులో లడ్డూ తయారీ చేయాలన్నారు. నూతన అన్నదాన (Annadana) భవనంలో అన్నదానం జరగాలన్నారు. దసరా ప్రత్యేక పూజలు కుంకుమార్చన, దేవిఖడ్గమాల, శ్రీచక్రనవణార్చనలు మహామండపం 6వ అంతస్థులో జరుగుతాయన్నారు. చండీహోమం యాగశాలలో జరుగుతాయన్నారు. అన్ని పూజల టికెట్లు ఆన్లైన్లో కొనుగోలు చేయాలన్నారు. టికెట్లు అందుబాటులో వుంచే వివరాలు త్వరలో తెలుపుతామన్నారు. భక్తులకు ఉదయం 6 నుండి 10.30 వరకు పులిహోర, కట్టుపొంగలి, కదంబం, దద్దోజనం అందిస్తామని, ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 వరకు భోజనం, సాయంత్రం 4 నుండి రాత్రి 9.30 వరకు పులిహోర, కదంబం కొండ దిగువన అందించాలని, మూలానక్షత్రం రోజున విజయదశమి రోజున చిన్న లడ్డూ ఉచితంగా అందింస్తామన్నారు.

కనకదుర్గమ్మ ఆలయానికి భారీ విరాళాలు
సమీక్ష సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ రంగారావు, ఇఇ లు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఇఓ చంద్రశేఖర్, సుధారాణి, గంగాధర్, రమేష్ బాబు, శ్రీనివాస్, తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మ వారి లయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు యు లక్ష్మిపార్వతి 5.1,00,1010 విరాళాన్ని సోమవారం తమ భర్త వెంకటేశ్వరరావు పేరిట నిత్యాన్నదాన పథకానికి అందించారు. విజయవాడకు చెందిన ఎస్ కృష్ణ, అనంతలక్ష్మి దంపతులు రు.1లక్ష విరాళాన్ని కనకదుర్గ డెవలెప్మెంట్ ట్రస్టుకు అందించారు. దాతలకు దుర్గమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు అనంతరం వారికి దుర్గమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలను అందించారు. శ్రీ కనకదుర్గానగర్ నుండి మహామండపం వరకు బిటి రోడ్ పనులు సోమవారం ప్రారంభమైన సందర్భంగా వాహ నాలకు ప్రవేశం లేదని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. వాహనదారులు ఘాట్రోడ్డు మార్గం లో కొండపైకి చేరుకోవాలన్నారు. దుర్గమ్మ వారిని దర్శించుకునే భక్తులు పోన్లను మొబైల్ కౌంటర్లలో భద్రపరుచుకోవాలన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :