తిరుమల : భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము 21వతేదీ శుక్రవారం తిరుమలకు(Draupadi Murmu) వస్తున్నారు. రెండు రోజుల తిరుపతి(Tirupati) జిల్లా పర్యటనలో భాగంగా 20వతేదీ సాయంత్రం 3.25గంటలకు రేణి గుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డుమార్గంలో తిరుచానూరుకు చేరుకుని పద్మావతిఅమ్మవారిని దర్శనం చేసుకుని రోడ్డు మార్గంలో సాయంత్రం తిరుమల పద్మావతి అతిధిగృహం వస్తారు.
Read also: ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు – సుప్రీం బెయిల్ డిసెం 9 వరకు పెంపు

21న వరాహస్వామి, శ్రీవారి దర్శనాలు
రాత్రికి(Draupadi Murmu) ఇక్కడే బస చేస్తున్న రాష్ట్రపతి 21వతేదీ ఉదయం 9.30 గంటలకు ఆలయ క్షేత్ర ప్రాశస్త్యాన్ని పాటిస్తూ వరాహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఉదయం 10గంటలకు తిరుమల ఆలయంలోనికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులందు కుంటారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుండి హైదరాబాద్కు ప్రయాణమవుతారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :