పంట వ్యర్థాలు కాల్చొద్దు
పంట వ్యర్థాలను కాల్చకుండా, పొలాల్లోనే కలియదున్నటం మేలని వ్యవసాయ సంచాలకులు డాక్టర్ మనజీర్(Dr. Manazir) జిలాని సమూన్ తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్(Kharif Season) వరిపంటలో కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఇప్పటికే కోతలు పూర్తయిన చోట కొందరు రైతులు రబీ పంట సాగు కోసం వరి కొయ్యలను, దుబ్బలను కాల్చే పనుల్లో నిమగ్నమై ఉన్నారని, దీనివల్ల వచ్చే పొగతో పర్యా వరణానికి నష్టం కాలుష్యం పెరగటమే కాకుండా పంట పొలాలకు అంతకు మించి నష్టంజరుగుతుందని శాస్త్రవేత్తలు తెలియజేశాయరన్నారు.
Read also: Pawan Kalyan: రేపు పీఆర్, ఆర్డీ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం ‘మాటామంతీ’

ముఖ్య మంత్రి చంద్రబాబు(Chandrababu) ప్రత్యేక సూచన మేరకు గ్రామస్థాయి సచివాలయ రైతు సేవా కేంద్రం సిబ్బందిచే రైతులకు పంట వ్యర్థాలను తగుల పెట్టవద్దు భూసారానికి, పర్యావరణానికి హాని తలపెట్టవద్దనే అంశంతో అవగాహన పెంచేలా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కాల్చడం వల్ల నేలకు పర్యావరణానికి పౌరసమాజానికి కలిగే నష్టాలను తెలియజేస్తూ… పోషకాలు నశిస్తాయని, భూమిలోని సేంద్రీయ కర్బనం తగ్గుతుంది.
సేంద్రీయ కర్బనం తగ్గిపోతుందని నిపుణుల హెచ్చరిక
సూక్ష్మ జీవులు నశిస్తాయి, తేమను నిలుపుకునే శక్తి తగ్గుతుంది. నేలల్లో ఆమ్ల గుణం పెరుగుతుంది. పర్యావరణ కాలుష్యం పెరిగి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. వీటికి భిన్నంగా వ్యర్థాలను నేలలోనే కలియబెట్టడం వల్ల కలిగే లాభాలను తెలియజేస్తూ పైరు ఎదుగుదలకు దోహదపడే అన్ని రకాల పోషకాలు భూమిలో కలిసి భూసారం పెరుగుతుందని, నేలలోని కార్బన్ శాతం పెరిగి తదుపరి పంటల దిగుబడులు పెరుగుతాయని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: