కాలగమనాన్ని ఎవరూ ఆపలేరు! చరిత్రను ఎవరూ తిరిగిరాయలేరు. కొందరి ప్రయత్నం చరిత్రను మార్చా లనే సంకల్పం, అందుకు తగ్గ ఏర్పాట్లు ఈ మధ్యకాలంలో విజ్ఞులు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకు ఈ ప్రయ త్నాలు జరుగుతున్నాయంటే జవాబు ఒక్కటే కళ్లముందు కదలాడుతున్నది. ప్రస్తుత పరిస్థితులను తమకు అను కూలంగా మల్చుకోవాలనే ఆరాటం వల్ల కొందరు చరిత్రను (History)తిరగతోడుతున్నారు. అర్థ సత్యాలను అనుకూలంగా విశ్లేషిస్తున్నారు. ఒక చిన్న ఆధారంతో మూలాలనే సమూలంగా పెళ్లగించాలనే ప్రయత్నంలో పడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే చరిత్ర (History)తో రాజకీయాలు చేస్తున్నారు. రెండు, మూడు వార్తా కథనాలు ఈ మధ్య కావాలనో, మరెందుకనో బహుళ ప్రచారంలో ఉన్నాయి. వీటి ప్రస్తావన కేవలం ఈ కథనాల ఆధారంతో పార్టీలు పబ్బం గడుపుకుందామనే ఆలోచనను బహిర్గతం చేసేందుకే!
ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్ పరిమెంట్స్ విత్ ట్రూత్’
అయితే ఒక కథనం ఈ నాటి యువతకు మార్గ దర్శకంగా నిలిచే కథనం. ఒక విధంగా చరిత్ర (History)సంగతి వది లేస్తే, ఆ కథనం జాతిని మరొక్కసారి మేల్కొలిపి, సరైన మార్గంలో పెట్టేదే! ఈ కథనంలో రాజకీయ ప్రమేయం పసి గట్టడానికి ఆధారాలు లేవు. కానీ ఈ మంచి వార్తను కూడా రాజకీయ నాయకులు తమపార్టీలకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారని హెచ్చరించేందుకే! నవజీవన్ ప్రెస్ ప్రచురించిన ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్ పరిమెంట్స్ విత్ ట్రూత్’ ఇప్పటివరకు అరవై ఒక్క లక్షల కాపీలు 17 భాషల లో అమ్ముడుపోయింది. అంతకంటే బహుశా ఎక్కువకాపీలే ప్రజలు తెచ్చుకొని చదివి ఉండవచ్చు. ఈ వంద సంవత్స రాలలో ఆ పుస్తకం ‘బెస్ట్ సెల్లర్’గా పేరు తెచ్చుకుంది. జాతి పిత మహాత్మాగాంధీ రాసిన రచన అప్పట్లో పీరియాడికల్గా నవజీవన్ ట్రస్ట్ నుంచి నవంబరు 1925లో మొదలైన విష యం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, ‘గాంధీ’ గొప్ప తనం దాదాపు జాతి, జాతిపితను మరిచిపోయిన తరుణం లో రిచర్డ్ అటెన్బరో సినిమా ‘గాంధీ’ని మరొక్కసారి మహ త్తరంగా జ్ఞప్తికి తెచ్చింది. ‘లగేరహో మున్నాభాయి’ హిందీ సినిమాతో మహాత్మా ముఖ్యంగా యువతకు దగ్గరయ్యారు. ఆసక్తిపరంగా ఇప్పుడు ఈ పుస్తకం కథ బయటకువచ్చింది. అయితే ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీలూ గాంధీ మహాత్ముడిని తమ రాజకీయ పార్టీలో ఉత్పన్నమవుతున్న ఏ సమస్యతో ముడిపెట్టకపోవడం చాలా మంది పాతకాలం వారికి ఊరట కలిగిస్తున్నది.

రహస్య సమాచారం
ఈ మధ్యన కాంగ్రెసులో సీనియర్ నాయకుడిగా ఎంతో అనుభవం గడించిన పి. చిదంబరం ఒక టి.వి ఇంటర్వ్యూలో చెప్పిన అంశం సెన్సే షనల్గా మారింది. కావాలనే ఆ ప్రస్తావన తెచ్చారో ఏమో కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెసు పార్టీకి మరో సమస్యను ఆయన ఇంటర్వ్యూ తెచ్చిపెట్టింది. ‘ముంబా యిలో 26/11 ఉగ్రవాద దాడుల తర్వాత మన్మోహన్ గవర్నమెంట్ పాకిస్థాన్ ప్రభుత్వానికి ధీటుగా ప్రతిదాడులతో జవాబు ఇవ్వడానికి సిద్దమైనా, ఆగిపోయింది. బహుశా అమెరికా ఒత్తిడి వల్ల కావచ్చు’ అని ఆ ఇంటర్వ్యూలో ఇచ్చి న అంశం సారాంశం. ఇన్నేళ్ల తర్వాత చిదంబరం ఎందుకు ఈ రహస్య సమాచారాన్ని అందివ్వాలని ఆశించారో తెలియదు. కానీ ఈ మాటలు మాత్రం కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపర్చడానికి కారణంగా మారాయి. టారిఫ్ లతో తన విదేశాంగ విధానంతో భారత్ను ట్రంప్ తక్కువ చూపు చూస్తూ, ప్రధానికీ, బిజెపి నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్న ఈ తరుణంలో ఎందుకు ఎన్నో పదవులు అనుభవించి కాంగ్రెసులో ప్రముఖ స్థానాన్ని పొందిన తమిళనాడు చిదంబరం కావాలనే ఈ నిప్పురవ్వ వదిలాడా, లేక యాదృచ్చికంగా ఈ సంగతి బయటపడిందా అన్న సంగతి అటుంచితే, బిజెపి పని మాత్రం గారెలబుట్టలో పడ్డట్లయింది. ఉగ్రవాదులు కాశ్మీర్ లో చేసిన పహల్గాం దాడి తర్వాత భారత్, ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ను భయంకరంగా నిర్వీర్యులను చేసింది. ప్రపంచ దేశాలు భారత్ ఆయుధ సంపత్తితో పాటు దాడి
నైపుణ్యాన్ని గుర్తించాయి. కాంగ్రెసు పార్టీతోసహా అన్ని పక్షాలూ ఆర్మీ దాడిని శ్లాఘించక తప్పలేదు. ఇటువంటి తరుణంలో దిక్కుతోచక ట్రంప్ అదే పనిగా తానే పాకిస్థాన్, భారత్లో మధ్య ఘర్షణలు ఆపానని, ప్రచారం చేసుకున్నా, ప్రపంచ దేశాలు నమ్మలేదు. అనేక రకాల ఆర్థిక, దౌత్య పరమైనఇబ్బందులు అమెరికా దేశం సృష్టించాలని ప్రయ త్నించినా భారత్ పైచేయే అందరికీ కనపడింది. ఇలాంటి పరిస్థితులలో చిదంబరం బయటపెట్టిన రహస్యం లాంటి ఆ మాట (ఎంతవరకు నిజమో కాని ఒక్కసారి కాంగ్రెసు పార్టీని పాతాళంలోకి తోసేసింది. అంతకు మునుపుకొందరు కాంగ్రెస్ నాయకులు కూడా ఇలాంటి మాటలతో ప్రతిపక్ష మైన కాంగ్రెసును బలహీనపర్చారు. బిజెపి నాయకులు కాంగ్రెస్ నిష్క్రియా పర్వాన్ని మాత్రమే ఎత్తిచూపుతున్నారు కానీ, చిదంబరం ఆ విధంగా ఈ తరుణంలో మాట్లాడటం భావ్యం కాదని మాటవరుసకైనా అనటం లేదు. అలా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి అనుకూలమైన పరిణామాలను ఎందుకు వదులుకుంటారు.
దేశ ప్రతిభను దిగజారుస్తున్నారు
చిదంబరం ప్రక టనకు విరుగుడుగా కాంగ్రెసు అధ్యక్షుడు ఖర్గే దేశమంతా స్వాతంత్ర్యం తెచ్చుకోటానికి బ్రిటిష్ వారితో పోరాడుతుంటే ఆర్.ఎస్.ఎస్ బ్రిటిష్ ప్రభుత్వానికే సహకరించిందని మళ్లీ పాత పాటనే తెరమీదకి తెచ్చారు. గాంధీ పుస్తకాన్నిగురించి అనుకోకుండా వచ్చిన కథనం ఆధారంగా గాడ్సే ఉదంతం కాంగ్రెస్ అనుకూలురు తెరమీదికి తెచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలతో ఇప్పుడిప్పుడే అగ్రస్థానం వహిస్తూ ఆర్థికపరంగా ఆర్మీపరంగా, అభివృద్ధి పరంగా ముందుకు దూసుకొని వెళ్తున్న మన దేశ ప్రతిభను రాజకీయాలతో దిగజారుస్తున్నందుకే ఆశ్చర్యపడాలి. ఆర్యస్. యస్ భారతీయ నాగరికత ప్రతిబింబిస్తున్న తత్వశాస్త్రానికి కస్టోడియన్ అని బిజెపి నాయకులన్నా, జాతిపిత గాంధీ ఆధునిక వైతాళికుడు జవహర్లాల్ నెహ్రూ వల్లనే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చామని కాంగ్రెసు చెప్పుకున్నా, చిదంబరం, శశిథరూర్ లాంటి నాయకులు రాజకీయ లబ్దిపొందాలనే తాపత్రం తమమాటల్లో అర్థనిజాలు వక్కాణించినా, ఆర్ యస్స్, వాజ్పాయ్ ప్రతిభాపాటవాలను బిజెపి నాయ కులు ఇప్పుడు తెరమీదకు తెచ్చినా భారత ప్రజలకు ఇప్పుడు ఒరిగేదేమీ లేదు. కలిసికట్టుగా ఆనాడు పోరాడబట్టే స్వాతం త్రం ఈ దేశానికి వచ్చింది. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో కొందరు అప్పుడు పుట్టలేదుకూడా! అందుకే ఆ ఫలా లను అందుకుంటూ, చెట్టుకాయలను అమ్ముకునే ప్రయత్నం ఈనాటి నాయకులు చేయడం న్యాయం కాదు. ఇప్పుడిప్పు డే మనదేశం అన్నివిధాలా ముందంజ వేస్తున్నది. దయచేసి వెనకకు లాగే ప్రయత్నాలు చేయడం భావ్యం కాదు.
-రావులపాటి సీతారాం రావు
చరిత్ర అంటే ఏమిటి?
చరిత్ర అంటే గత సంఘటనల అధ్యయనం. గతంలో ఏమి జరిగిందో ప్రజలు గతంలోని విషయాలను (పుస్తకాలు, వార్తాపత్రికలు, స్క్రిప్ట్‌లు మరియు లేఖలు వంటివి), భవనాలు మరియు వివిధ రకాల కళాఖండాలు (కుండలు, పనిముట్లు, నాణేలు మరియు మానవ లేదా జంతువుల అవశేషాలు వంటివి) చూడటం ద్వారా తెలుసుకుంటారు.
చరిత్రను ఉత్తమంగా నిర్వచించేది ఏది?
చరిత్ర యొక్క ఉత్తమ నిర్వచనం మానవ గతాన్ని అధ్యయనం చేయడం మరియు కాలక్రమేణా మార్పుల కథ. ఈ ఎంపిక గతాన్ని మరియు సమాజాలు ఎలా అభివృద్ధి చెందాయో పరిశీలించే ఒక విభాగంగా చరిత్ర యొక్క సారాంశాన్ని ఖచ్చితంగా సంగ్రహిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper :https://epaper.vaartha.com/
Read Also: