వీధి కుక్కలు ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. అయినా వాటి నియంత్రణపై ఉదాసీనత చూపిస్తున్నాం. కొన్నిరోజుల కిందటే సుప్రీంకోర్టు(Supreme Court) వీధికుక్కలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా కోర్టు ఆదేశించింది. కుక్క కాటు ప్రమాదకరం. రోడ్లపై మూకుమ్మడిగా దాడి చేస్తే పెద్దవారైనా తప్పించుకోవడం కష్టమే. అలాంటి ఓ బాలుడికి కుక్క కరవడంతో అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి.
రేబిస్తో బాలుడు మృతి
గుంటూరు జిల్లా(Guntur) పొన్నూరు మండలంలోని వెల్లలూరు గ్రామానికి చెందిన తాడిశెట్టి రాజా, జ్యోతి దంపతులకు కార్తీక్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. 15 రోజుల క్రితం కార్తీక్ ఇంటిబయట ఉండగా బాలుడి తల, చేతులపై వీధి కుక్క దాడి చేసింది. తల్లిదండ్రులు వెంటనే పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడి ఆరోగ్యంలో మార్పులు రావడంతో విజయ వాడలోని ప్రైవేట్ వైద్యశాలకు(Private Hospital) తరలించారు. బాలుడికి రేబిస్ సోకినట్లుగా వైద్యులు గుర్తించి, చికిత్స అందించసాగారు. కానీ ఇంతలో బాలుడి పరిస్థితి విషమించి, మరణించాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడిని వీధి కుక్క బలితీసుకుందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీధి కుక్కలను నియంత్రించాలని లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టసంఘటనలు చోటు చేసుకుంటాయని స్థానికులు అధికారులను కోరుతున్నారు.”

బాలుడు ఎలా మృతి చెందాడు?
కుక్క కాటు కారణంగా రేబిస్ సోకడంతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు ఎందుకు సమయానికి చికిత్స చేయించలేదు?
కుక్క కాటు జరిగిన తర్వాత పెద్దగా పట్టించుకోకపోవడంతో టీకాలు వేయలేదు, దాంతో పరిస్థితి విషమించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: