కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్
కుప్పం (చిత్తూరు): సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో దేశంలోనే తొలిసారిగా కుప్పంనియోజకవర్గంలో ప్రతి గ్రామానికి చెత్త సేకరణకై ఇ -ఆటోలు ఏర్పాటుచేస్తున్నట్లు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ (Vikas Marmat) పేర్కొన్నారు. బుధవారం కడ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడ ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్ సంస్థచే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కుప్పంలో ఎయిర్ పోర్టుకు భూసర్వే పూర్తయిందని త్వరలోనే అవార్డు పాస్ (పరిహారం)చేస్తామని పేర్కొన్నారు.

చర్యలు చేపడుతున్నట్లు
డిసెంబర్ నెలలో పనులు మొదలు పెడతామన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్న రైతులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతులకు 13కోట్ల బకాయిలు ఉండగా వడ్డీతో కలిపి డబుల్గా 25 కోట్లు చెల్లించాలని సిఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించారన్నారు. కుప్పం (Kuppam) నియోజక వర్గంలో త్వరలోనే 110 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైన్ల నిర్మాణ పనులకు చర్యలు చేపడుతున్నట్లు తెలి పారు. ఏడాది కాలంలోనే కుప్పంలో ఆరు పెద్ద పరిశ్రమలు వచ్చాయన్నారు. వీటిద్వారా 13వేల ఉద్యోగాలు ఖరారవుతాయన్నారు.
చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు?
2024 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన అనంతరం, 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నాయకత్వంలో 24మంది మంత్రులతో కూడిన మంత్రిమండలిని ఏర్పాటు చేశారు.
చంద్రబాబు నాయుడు యాజమాన్యంలో ఉన్న కంపెనీ ఏది?
హెరిటేజ్ గ్రూప్ అనే కంపెనీ 1992లో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. ఈ గ్రూప్‌లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (HFL) అనే ప్రధాన కంపెనీ కింద డైరీ, రిటైల్, అగ్రి అనే మూడు విభాగాలు ఉన్నాయి. అలాగే హెరిటేజ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ అనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ కూడా ఈ గ్రూప్‌లో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Chandra babu: ప్రజల సేవ కోసమే టెక్నాలజీ