శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) లో ఉగ్రవాదుల కదలికల వార్తలు వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. కోట కాలనీకి చెందిన నూర్ అనే అనుమానిత వ్యక్తిని జాతీయ భద్రతా సంస్థ ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. నూర్ ధర్మవరంలోని ఓ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తూ, బయటికి సాధారణ జీవితాన్ని నడిపిస్తున్నట్లే కనిపించినా, ఉగ్రవాద సంస్థలతో ఆయనకు సంబంధాలున్నాయని ఎన్ఐఏ అనుమానిస్తోంది.నూర్‌ను రెండు రోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుండి ఆయనను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా ఆయన నివాసంలో సోదాలు జరిపిన అధికారులు 16 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్‌కార్డుల ద్వారా నూర్ ఎవరితో సంబంధాలు కొనసాగించాడో, ఏ ఉద్దేశంతో వాడాడో అనేది ప్రస్తుతం ఎన్ఐఏ (NIA) దృష్టిలో ప్రధాన ప్రశ్నగా మారింది.

ఈ ఆపరేషన్‌ను
ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలపై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులకు ధర్మవరంలో నూర్ అనే యువకుడికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఎన్‌ఐఏ అత్యంత గోప్యంగా నిర్వహించింది. గత కొంతకాలంగా నూర్ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు, పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ధర్మవరం ప్రాంతంలో భయాందోళనలకు దారితీసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: