విజయవాడ : పోలీసులు నిరంతరం ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం అవసరమని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం(DGP Harish Kumar Gupta) చేసారు. క్రీడలు, యోగా వంటివి మంచి ఆరోగ్యాన్నిస్తాయన్నారు. అందుకే రోజులో కొద్దిసేపు ఆటలకు, నడక ఇతర అంశాలకు కేటాయించాలన్నారు. డ్రిల్ తో పాటు ఇవన్ని వ్యాయామ అంశాలు కావాలన్నారు. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు(All India Police Sports Control Board) ఆధ్వర్యంలో అక్టోబర్ 13 నుండి 17 వరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ ఆల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26 పోటీలు ముగిశాయి. మంగళగిరి 6వ బెటాలియన్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర డీజీపీ, చైర్మన్ (రెండవ ఆల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26) హరీష్ కుమార్ గుప్తా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, యోగ పోటీల్లో గెలిపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
Read Also: BR Naidu:లడ్డూ ‘ధర’ పెంపు వార్తలు నమ్మొద్దు

ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta) మాట్లాడుతూ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ లో పోటీపడుతున్న పోలీస్ క్రీడాకారుల ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదల అందరికీ స్పూర్తినిచ్చాయన్నారు. అతిథ్యం, వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందాన్ని డీజీపీ ఈ సందర్భంగా అభినందించారు. వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయం (ఏఎన్ యూ) గుంటూరు యోగ పోటీలు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) అమరావతి వేదికగా జరిగిన విషయం విదితమే.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సీపీవోల నుంచి వచ్చిన 32 టీమ్ కు చెందిన 1010 మంది క్రీడాకారులు ఈ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్లో పాల్గొన్నారు. వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్లో (పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ మరియు యోగాలో) అత్యది ,.కంగా 37 పతకాలు సాధించి ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. 33 పతకాలతో బీఎస్ఎఫ్ ద్వితీయస్థానంలో 20 పతకాలు సాధించి ఐటీబీపీ తృతీయస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 11 పతకాలతో 6వ స్థానంలో నిలిచింది. యోగాలో బీఎస్ఎఫ్ చెందిన సోనియాకుమారి వ్యక్తిగత విభాగంలో అత్యధిక పతకాలు సాధించింది. యోగా పురుషుల విభాగంలో ఉత్తరప్రదేశ్కు చెందిన రాజీవ్ కుమార్ అత్యధిక పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహణలో పాలుపంచుకున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, వేలూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (విట్) అమరావతి, యాజమాన్యానికి డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: