ఆత్మకూరు Development : నల్లమలలో నివశించే చెంచు, గిరిజనుల అభివృద్ధికి ఐటిడిఏ శాఖ ద్వారా రూ.10కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి (Gummadi Sandhya Rani) శ్రీశైలం నియోజకవర్గం ఎంఎస్ఏ బుడ్డా రాజశేఖరరెడ్డిలు అన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డి నగర్ కాలనీలో నన్నారి కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా మంత్రిని మర్యాద పూర్వకంగా నియోజకవర్గం ఎంఎస్ఏ బుడ్డా రాజశేఖరరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజాకుమారి ఘనియా ఆహ్వనించారు. శిలాఫలకం ప్రారంభించినన్నారి తయారి విదానం చెంచు గిరిజనులతో మంత్రి అడిగి తెలుసుకున్నారు. నల్లమల అడవిలో నివశించే చెంచు గిరిజనుల స్థితిగతులపై చెంచు గిరిజనులతో ముఖాముఖిగా మాట్లాడారు.. అక్కడే చేతివృత్తులతో తయారి చేసిన సంచులు, ఇతర వస్తువుల కేంద్రం ప్రారంభించారు. గిరిజనులకు మంచినీటి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేశారు.
మహిళలు, గిరిజనుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి – మంత్రి
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు పెద్దపీఠ వేసిన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (Chief Minister Chandrababu Naidu) దక్కిందన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని 1500ల మంది కుటుంబాలకు జీవనోపాధి కల్పించే విదంగా ప్రధానమంత్రి జననందన్ యోజన పథకం క్రింద రూ.25లక్షలతో తయారు కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. చెంచు గిరిజనులు తన ఉపాధి కోసం అడవి ప్రాంతంలోనన్నారి గడ్డలు సేకరించి మూడు రోజుల పాటు తయారు చేసే ఈ విదానాన్ని కేవలం ఒకరోజులోనే తయారు చేసే విదంగా అవకాశం కల్పించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :