ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ‘సుపరిపాలనకు ఏడాది’ పేరుతో రాష్ట్ర అభివృద్ధిపై 20 పేజీల నివేదికను విడుదల చేశారు. అధికార బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఆయన స్పష్టం చేశారు.2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రానికి అభివృద్ధి అనవసరంగా దూరమైందని పవన్ విమర్శించారు. జగన్ (Jagan) పాలనలో ప్రజలు అణచివేయబడ్డారని, శాంతి భద్రతలు పూర్తిగా బలహీనమయ్యాయని వ్యాఖ్యానించారు. యువత భవిష్యత్తుపై అసంతృప్తి పెరిగిందన్నారు.
ఎన్డీఏ చారిత్రాత్మక విజయం
164 అసెంబ్లీ సీట్లతో ఎన్డీఏ ఘన విజయం సాధించిందని పవన్ గుర్తుచేశారు. దీనివల్ల ప్రజల్లో కాకుండా పెట్టుబడిదారుల్లోనూ నమ్మకం పెరిగిందని చెప్పారు. మోదీ, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాటలోకి వచ్చిందన్నారు.తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నానని పవన్ తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, శాస్త్ర, అటవీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నివేదిక రూపంలో అందించామన్నారు.
కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు
ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మోదీ నాయకత్వాన్ని పవన్ ప్రశంసించారు. జలశక్తి, పంచాయతీరాజ్ తదితర శాఖల మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. రానున్న నాలుగేళ్లలో రెట్టింపు అభివృద్ధికి తాము సిద్ధమన్నారు.
Read Also : PSR Anjaneyulu : నాకు బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. ఏపీ హై కోర్టులో ఆంజనేయులు పిటిషన్