ఈ దేశవ్యాప్తంగా మూడురంగుల పండుగ ఘనంగా జరుగుతున్నది. వాడవాడలా త్రివర్ణపతాకాన్ని ఎగురవేస్తున్నారు. ఈ సందర్భంగా కాకినాడలో డిప్యూటీ సీఎం (CM) పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగురవేసారు. (CM) ఇదేసమయంలో పిఠాపురంలో 9కోట్ల 60లక్షల రూపాయలతో నిర్మించే ఇండస్ట్రియల్ పార్కు వర్చువల్ శంకుస్థాపన చేశారు. విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అన్నారు.
జెండాను ఎగురవ వేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. సీఆర్పీఎఫ్ జవాన్ల గౌరవ వందనాన్ని స్వీకరించి, వారందరికీ మిఠాయిలు పంచారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో వేలాదిమంది తమ ప్రాణాలను బలిగా ఇచ్చారని, వారి త్యాగఫలితమే మనం నేడు స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామని, వారి త్యాగం గొప్పదని కిషన్ రెడ్డి కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో సైతం మనదేశ సైనికులు తమ అసమాన ప్రతిభను చాటి, పాకిస్తాన్ తోకముడుచుకునేలా చేశారని, భారతీయ సైన్యాన్ని కిషన్ రెడ్డి ప్రశంసించారు